అనుష్కాశెట్టి ఘాటి సినిమా రివ్యూ

Viswa
AnushkaShetty and Vikram Prabhu Ghaati Movie Telugu Review

కథ

ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దుల్లో జరిగే కథ ఘాటి (Anushka Shetty Ghaati Review). తూర్పు కనుమల్లో పండే గంజాయిని స్మగ్లింగ్‌ చేసే ఘాటి(గంజాయిని అక్రమంగా రావణా చేసే కూలీలు)లను కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్‌), కుందుల నాయుడు (చైతన్యారావు)లు శాసిస్తుంటారు. మరోవైపు శీలావతి (అనుష్కా శెట్టి) బస్‌ కండక్టర్‌గా, ఆమె బావ దేశీ రాజు (విక్రమ్‌ ప్రభు) మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌గా జీవనం సాగి స్తుంటారు. ఈ ఇద్దరు కూడా ఒకప్పుడు ఘాటిలే. కానీ తన అమ్మకు ఇచ్చిన మా ట కోసం దేశీ రాజు ఘాటి పని మానేసి, ల్యాబ్‌ టెక్నిషియన్‌గా జీవనం సాగిస్తుంటాడు. శీలా వతి కూడా ఘాటి పని మానేసి, కండక్టర్‌గా పని చేస్తుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల శీలా వతి, దేశీ రాజు…ఇద్దరూ మళ్లీ ఘాటీలుగా మారతారు. ఘాటిలుగా మారడమే కాదు… కాష్టాల నాయుడు, కుందుల నాయుడు వ్యాపారానికి ఎదురు వెళ్తారు. అయితే శీలావతి– దేశీ రాజుల పెళ్లి జరుగుతున్న రోజే, కాష్టాల నాయుడు– కుందుల నాయుడు వీరిపై దాడి చేస్తాడు. ఈ దాడిలో దేశీ రాజు చనిపోతాడు. శీలావతి కూడా తీవ్రంగా గాయపడుతుంది. మరి.. తన బావ దేశీ రాజును చంపిన కాష్టాల నాయుడు నాయుడు– కుందుల నాయుడుపై శీలావతి ఏ విధంగా పగ తీర్చుకుంది? స్మగ్లింగ్‌ పని మానేయమని ఘాటిలను శీలావతి ఏ విధంగా మోటివేట్‌ చేసింది? అసలు దేశీ రాజు కల ఏమిటి? ఈ గంజాయి మాఫియాలో పోలీసుల పాత్ర ఏ మేరకు ఉంది? ఇంతకీ…దేశీ రాజు, శీలావతిలు ఎందుకు మళ్లీ ఘాటిలుగా మారాల్సి వచ్చింది? అనేది వెండితెరపై చూడాలి.(Anushka Shetty Ghaati Review)

Aanushka Shetty_Ghaati_Review

విశ్లేషణ

స్మగ్లింగ్‌ మాఫియాలో ‘పుష్ప’ సినిమా ఓ బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయింది. దీంతో స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే ఏ సినిమాను అయినా ‘పుష్ప’తో పోల్చి మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు. చెప్పాలంటే..‘ఘాటి’ సినిమా కూడా అంతే. గంజాయి స్మగ్లింగ్‌ సిండికేట్‌లోని కూలీలైన దేశీ రాజు, శీలావతిలు వాటా దారులుగా మారి, తమ ఘాటి ప్రజలకు మేలు చేయాలనుకుంటారు. అంటే…కాస్త అటు ఇటుగా…రాబిన్‌హుడ్‌ తరహా పాత్రలు అన్నమాట. సింపుల్‌గా ‘ఘాటి’ కథ ఇంతే. ఇక్కడ స్మగ్లింగ్‌ చేసే మార్గాలు కూడా ‘పుష్ప’ సినిమాలోమాదిరిగా, ఎగై్జటింగ్‌గా అనిపిం చవు. తొలిభాగం అంతా చాలా రోటీన్‌గా సాగుతుంది. రైల్వే స్టేషన్‌ ఎపిసోడ్‌ కూడా కిక్‌ ఇవ్వ దు. దేశీ రాజు–శీలావతిలపై జరిగే ఎటాక్‌తో ఇంట్రవెల్‌ వస్తుంది. సెకండాఫ్‌లో శీలవతి పగ తీర్చుకోవడం, ఆ తర్వాత ఘాటిల కోసం ఏదైనా మంచి పని చేయాలనుకోవడం, ఇందుకు కుందుల నాయు డు అడ్డుపడటం, ఫైనల్‌గా కుందుల నాయుడిని శీలావతి అంతం చేయడంతో సినిమా ముగుస్తుంది. అనుష్క చేసిన రెండు యాక్షన్‌ సీక్వెన్స్‌లు మాస్‌ ఆడియన్స్‌ను అల రిస్తాయి. కానీ సినిమాలో ఎమోషన్స్‌– యాక్షన్‌ సీక్వెన్స్‌లు సరిగా బ్లెండ్‌ కాలేదనే అనిపిస్తాయి. గంజాయి స్మగ్లింగ్‌ను మానేసిన ఘాటిల జీవనాధారం నెక్ట్స్‌ ఏంటి? అన్న విషయంపై సరైన క్లారిటీ లేదు. చావుబతుకుల్లో ఉన్న శీలావతి సడన్‌గా లేచి, పదిమంది విలన్స్‌ను చంపే యాక్షన్‌ సీక్వెన్స్‌ కన్విన్సింగ్‌గా ఉండదు. క్లైమాక్స్‌ను కూడా సాగదీసినట్లుగా ఉంటుంది. పైగా కొత్తదనం ఏమీ లేదు.

నటీనటులు-సాంకేతిక విభాగం

శీలావతిగా అనుష్కాశెట్టి (Anushka Shetty )పెర్ఫార్మెన్స్‌ బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మాస్‌ అనుష్క కని పిస్తుంది. కానీ ఈ పాత్ర ఆర్క్‌ని డిజైన్‌ చేయడంతో మాత్రం క్రిష కాస్త తడిబడినట్లుగా అని పిస్తుంది. తమిళ నటుడు విక్రమ్‌ ప్రభు బాగానే చేశాడు. విక్రమ్‌కు తెలుగులో ఇది తొలి సినిమా. ఫస్టాఫ్‌లో విక్రమ్‌యే హీరో అన్నట్లుగా కథ సాగుతుంది. ‘ఘాటి’ సినిమా కోసం చైతన్యరావు తొలిసారిగా విలన్‌ రోల్‌ చేశాడు. ఈ క్యారెక్టర్‌ను స్టైలిష్‌ అండ్‌ స్వాగ్‌తో డిజైన్‌ చేసినట్లు ఉన్నారు క్రిష్‌. కానీ కుందుల నాయుడు స్క్రీన్‌పై చెప్పే డైలాగ్స్‌ తక్కువే. మేజర్‌ సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌ అండ్‌ గట్టిగా అరుపులతోనే సరిపెట్టారు. యాక్టింగ్‌కు పెద్ద స్కోప్‌ లేకుండా పోయింది. కష్టాల నాయుడుగా రవీంద్ర విజయ్‌ ఉన్నంతలో మెప్పించాడు. పోలీస్‌ ఆఫీసర్‌ విశ్వదీప్‌ గా జగపతిబాబు, విలన్స్‌ పక్కన ఉండే మరో పోలీస్‌ ఆఫీసర్‌గా జాన్‌ విజయ్, అనుష్కకు హెల్ప్‌ చేసే పాత్రలో రాజాలు వారి పాత్రల పరిధి మేరకు నటించారు. గంజాయి స్మగ్లింగ్‌లోని కార్పొరేట్‌ వ్యక్తులుగా జీస్సూ సేన్‌ గుప్తా, లారిస్సా బోనేసిలు నటిం చారు. జీస్సూ సేన్‌ గుప్తా, ఎంపీగా వీటీవీ గణేష్‌ పాత్రలు స్క్రీన్‌ ప్రజెన్స్‌ వరకూ మాత్రమే సరిపోయాయి. ఇక టెక్నికల్‌గా ఘాటి సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా మనోజ్‌ కెమెరా వర్క్‌ బాగుంది. విద్యాసాగర్‌ మ్యూజిక్‌ అక్కడక్కడమే మాత్రమే సౌండ్‌ చేయగలిగింది. ఆర్‌ఆర్‌ సరిగ్గా కుదర్లేదు. సెకండాఫ్‌లో వచ్చే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో మాత్రం మంచి ఆర్‌ఆర్‌ కుదిరింది. ఇంకాస్త ఎడిటింగ్‌ చేయవచ్చు. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అక్కడక్కడ బాగానే వినిపించాయి.

ఫైనల్‌గా: గంజాయి స్మగ్లింగ్, పగ, ప్రేమ, సామాజిక స్పృహ అంశాల నేపథ్యంతో సాగే ఓ రోటీన్‌ యాక్షన్‌ డ్రామా ఘాటి. మాస్‌ ఆడియన్స్‌కు ఓ మోస్తారుగా నచ్చచ్చు.
రేటింగ్‌: 2.25/5

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *