యానిమేషన్ సినిమాల ట్రెండ్ టాలీవుడ్‌లో ఊపందుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ముంబై ఫిల్మ్‌మేకర్–యానిమేటర్ తీసిన యానిమేషన్ ఫిల్మ్ ‘మహావతార నరసింహా’ సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. రూ. 30 కోట్ల రూపాయల బడ్జెట్‌లోపే తీసిన ఈ చిత్రం థియేట్రికల్‌గా రూ. 300 కోట్లకుపైగా పైగా వసూళ్లను రాబట్టి, ట్రెడ్ వర్గీయులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇంకా ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్ హక్కులు మహావతార నరసింహా సినిమాకు అదనపు లాభాలు.
దీంతో యూనిమేషన్ చిత్రాలను తీయాలని టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ కొందరు ఆలోచన చేస్తు న్నారు. కానీ ఈ దారిలో టాలీవుడ్ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ముందడుగు వేశాడు.లార్డ్ హనుమాన్ జీవితం ఆధారంగా ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమాను నిర్మించ నున్నామని, గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమాపై వర్క్ జరుగుతోందని, దర్శకుడు చందు మోండేటి ‘వాయుపుత్ర’ సినిమాను తెరకెక్కిస్తారని వెల్లడించారు. అంతేకాదు..తెలుగు, తమిళం, హిందీ, కన్నడం,మలయాళం భాషల్లో వాయుపుత్ర సినిమాను వచ్చే దసరా సంద ర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు నాగవంశీ. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం మిగతా వివ రాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

గతంలో నిఖిత్‌తో ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ వంటి మైథలాజికల్ టచ్ ఉన్న హిట్ ఫిల్మ్స్ తీసిన చందు మొండేటి, వాయుపుత్ర సినిమాకు దర్శకుడు కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఉంటాయి. అయితే గతంలో ‘కార్తికేయ 3’ సినిమాను ప్రకటించాడు చందు మొండేటి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ముందుగా, వాయుపుత్ర, ఆ తర్వాత కార్తికేయ3 చిత్రాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.