Pawankalyan OG Reshoot: పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ సినిమాకు రీ షూట్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్‌కల్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్‌లోని గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (Pawankalyan OG). ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే పవన్‌కల్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ జూన్ 8నే పూర్తయినట్లుగా మేకర్స్ ప్రక టించారు.
PACKUP for GAMBHEERA…
GEAR UP for the RELEASE…See you in theatres on 25 September 2025. #OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/uGucg8BGgo
— DVV Entertainment (@DVVMovies) June 7, 2025
కానీ తాజాగా ఓజీ మూవీ షూటింగ్ పూర్తయినట్లుగా, మేకర్స్ శనివారం చెబు తున్నారు. ఈ ఫోటోలో పవన్‌కల్యాణ్ కూడా ఉన్నారు. అంటే ‘ఓజీ’లోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేశారని అర్థం అవుతోంది. ఒకవేళ లాస్ట్ డే షూట్ కనుక, పవన్ షూటింగ్‌లో పాల్గొన్నారనుకున్నా కూడా, ఒక్క రోజు కోసం ప్రస్తుతం పవన్ ఉన్న బిజీలో టైమ్ కేటాయిం చడం కష్టం. సినిమాకు సంబంధించి ఏదైనా పెద్ద పని ఉంటేనే పవన్ సెట్స్‌లోకి వస్తారు. దీని బట్టి ఓజీ రీషూట్స్ జరిగినట్లుగా కన్ఫార్మ్ చేసుకోవచ్చెమో. పవన్ కల్యాణ్ గత చిత్రం హరిహరవీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ తరుణంలోనే ఓజీపై సుజిత్ ప్రత్యేక ఫోకస్ పెట్టి, కొన్ని షాట్స్‌ను రీ షూట్ చేశాడట. డీవీవీ దానయ్య, దాసరి కిరణ్ ఈ సినిమాకు నిర్మాతలు.
The picture we clicked with OG on the last day ❤️🔥
Cheers to our amazing men bringing FIREEEE to deliver the BLOCKBUSTER on screens from September 25th 💥#TheyCallHimOG #OG pic.twitter.com/e5hLrPguqq
— DVV Entertainment (@DVVMovies) September 13, 2025
పవన్‌కల్యాణ్ ఈ మూవీలో ‘ఓజాబ్ గంబీర’ (ఓజీ) పాత్రలో నటించాడు. పవన్‌కు విలన్‌గా ఇమ్రాన్‌హాష్మి యాక్ట్ చేశాడు. ‘ఓమి’ పాత్రలో పవన్‌కల్యాణ్ కనిపిస్తాడు. ఈ చిత్రంలో నెహాశెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేశారు. శ్రియా రెడ్డి, అర్జున్‌దాస్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రి యాంక అరుల్ హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కనుక బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా మంచి మైలైజ్ ఉంటుంది. ఆల్రెడీ యూఎస్‌లో బుకింగ్స్ ఓపెన్ చేయగా, సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది ఓజీ సినిమాకు. పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే హాయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఉండేలా ఈ ఓజీ చిత్రం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సెప్టెంబరు 25నే బాలకృష్ణ ‘అఖండ 2’, సాయిధరమ్‌తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సిని మాలూ విడుదల కావాల్సింది. కానీ ఈ రెండు చిత్రబృందాలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో ‘ఓజీ’ సినిమాకు సోలో రిలీజ్ కన్ఫార్మ్ అయిపోయింది.