షాహిద్‌ సినిమాలో రష్మిక…కన్ఫార్మ్‌!

Viswa
Rashmika Mandanna in Cocktail2 Movie

Web Stories

Cocktail2: హిందీలో రష్మికమందన్నాకు మంచి క్రేజ్‌ ఉంది. దీంతో రష్మిక వరుస సినిమాలకు సైన్‌ చేస్తోంది. లేటెస్ట్‌గా షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించనున్న రొమాంటిక్‌ డ్రామా ‘కాక్‌టైల్‌ 2’ (Cocktail2) చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు. కృతీసనన్‌ ఈ చిత్రంలో మరో హీరోయిన్‌. ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టారు మేకర్స్‌. తొలి షూటింగ్‌ షెడ్యూల్‌లోనే రష్మిక–షాహిద్‌–కృతీసనన్‌లపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. తొలుత ఇండియన్‌ లోకేషన్స్‌లో మేజర్‌ షూటింగ్‌ పూర్తి చేసి, ఆ నెక్ట్స్‌ యూరప్‌ వెళ్లాలన్నది చిత్రంయూనిట్‌ షూటింగ్‌ ప్లాన్‌ అట. జనవరి కల్లా షూటింగ్‌ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇక సైఫ్‌అలీఖాన్‌ నటించిన ‘కాక్‌టైల్‌ (2012)’ సినిమాకు సీక్వెల్‌గానే, ‘కాక్‌టైల్‌ 2’ సినిమా తెరకెక్కుతోంది. తొలిపార్ట్‌కు దర్శకత్వం వహించిన, హోమి అడజానియానే, సీక్వెల్‌ను డైరెక్ట్‌ చేస్తున్నాడు.

ఇక ఈ కాక్‌టైల్‌ 2 సినిమా కాకుండ, రష్మిక మందన్నా హిందీలో నటించిన ‘థామా’ సినిమా ఈ ఏడాది రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ఖురానా హీరో. అదిత్య సర్పోద్దార్‌ డైరెక్టర్‌. ఇంకా రష్మిక మందన్నా తెలుగులో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా విడుదలకు సిద్ధమైంది. అలాగే ‘డియర్‌ కామ్రేడ్‌, గీతగోవిందం’ వంటి సినిమాల తర్వాత విజయ్‌, రష్మికలు మళ్లీ కలిసి నటిస్తున్నారు. రాహుల్‌ సంక్రుత్యాన్‌ ఈ సినిమాకు దర్శకుడు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos