OG Heroine Priyanka Mohan: నానీస్ ‘గ్యాంగ్‌లీడర్, సరిపోదాశనివారం’ పవన్ కల్యాణ్ (Pawankalyan) ‘ఓజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యారు హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్. పవన్ క ల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న (OG Movie Release date) విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రియాంక. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు.
ఓజీ సినిమా కథ విన్న తర్వాతే ఈ సినిమాకు ఒప్పుకున్నాను. పవన్‌కల్యాణ్‌గారు హీరో అని కాదు. ఈ సినిమాలో నేను చేసిన కన్మణి పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో నేను ‘సువ్వి సువ్వి’ అనే ఒక్కపాటే నాకు ఉంది.
ఓజీ సినిమాలో నేను కన్మణీ అనే పాత్రలో నటించాను. ఓజీ లైఫ్‌ని టర్న్ చేసే పాత్ర నాది. 1980–1990 నేపథ్యంలో సాగే కథ ఇది. డీవీవీ బ్యానర్‌లో ‘సరిపోదా శనివారం కంటే ముందే ‘ఓజీ’ సిని మాకు సైన్ చేశాను. కానీ ‘ఓజీ’ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ‘ఓజీ’ (Pawankalyan OG) సినిమా విలన్ ఇమ్రాన్ హష్మితో నాకు కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి సినిమాలో సర్‌ప్రైజింగ్ ఉంటాయి. థియేటర్స్‌లో చూడండి.
పవన్‌కల్యాణ్‌గారితో మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ఆయన సెట్స్‌లో ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండేవారు. ఏ లొకేషన్ లో షూటింగ్ జరిగినా, ఆయన పార్టీ నాయకులు కూడా ఉండేవారు. కానీ పవన్‌కల్యాణ్‌గారు డిప్యూటీసీయంగా గెలిచిన తర్వాత సెట్స్‌లో చాలా కామ్‌గా ఉన్నారు. అలాగే అంతే బాధ్యతగా వ్యవహిస్తున్నారు. కాస్త రిలాక్డ్స్‌గా అయితే ఉన్నారు. పవన్‌గారు ఆన్‌స్క్రీన్‌లోనే కాదు..ఆఫ్‌స్క్రీన్‌లోనూ లీడరే!
సోషల్‌మీడియా వల్ల నా సమయం చాలా వృథా అవుతుంది. సోషల్‌మీడియాలో నెగటివిటీ కని పిస్తుంది. డబ్బులు ఇచ్చీ మరీ నెగటివిటీని స్ప్రెడ్ చేస్తారని విన్నాను. నా ‘ఎక్స్’ ఖాతాను నా టీ మ్ మెయిన్‌టెయిన్ చేస్తుంది. నేనైతే సోషల్‌మీడియాకు దూరంగానే ఉంటాను.
బాక్సాఫీస్ కలెక్షన్స్ అనేవి నేను పెద్దగా పట్టించుకోను. వాటి వల్ల నాకు ఏ ఉపయోగం లేదని నా భావన. బాక్సాఫీస్ కలెక్షన్స్ వెంటపడి, సినిమా క్రాఫ్ట్‌ని, ఇందులోని బ్యూటీని చంపేసుకుం టున్నారు. ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ కూడా వేస్తున్నారు.
ఇప్పటి యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత లేకుండ పోయింది. ఒక రకంగా, కొంతమంది దర్శక–నిర్మాతలైనా, ఉమెన్‌సెంట్రిక్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందుకు సంతోషంగా ఉంది.