Pawankalyan OG Tickets: పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. ఈ సినిమా ఈ నెల 25 (OG Release date)న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆల్రెడీ యూఎస్‌లోని కొన్ని థియేటర్స్‌లో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. యూఎస్‌లో ప్రీ బుకింగ్ సేల్స్ రూపంలో ఆల్రెడీ వన్ మిలియన్ డాలర్స్‌ను ‘ఓజీ’ సినిమా క్రాస్ చేసింది. పవన్‌కల్యాణ్ కెరీర్‌లో ఇదొక రికార్డు.
బినిఫిట్ షోకు రూ. 1000
ఈ సంగతి ఇలా ఉంచితే…రిలీజ్‌కు ఎనిమిది రోజులు ముందే ఆంధ్రప్రదేశ్‌లో ‘ఓజీ’ సినిమాకు చెందిన సినిమా టికెట్ ధరల హైక్‌కు సంబంధించిన జీవోని జారీ చేశారు. ఈ జీవో ప్రకారం.. సినిమా రిలీజ్ రోజు మిడ్‌నైట్ 1ఏమ్ షోలోను బెనిఫిట్ షోలుగా ప్రదర్శించుకోవచ్చు. ఈ షో టికెట్ ధరను రూ. 1000 (OG Movie Benifitshow ticket cost) గా నిర్ణయించారు. గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ రెండో పార్టు ‘పుష్ప ది రూల్’ సినిమాకు, ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శించగా, ఈ ప్రిమి యర్ షో టికెట్ ధరను రూ. 900గా ఉంచారు. ఈ ప్రకారం ప్రిమియర్ షో..టికెట్ ధర విష యంలో ‘పుష్ప 2’ సినిమాను ‘ఓజీ’ సినిమా క్రాస్ చేసింది. ఇంకా ఓ ప్రీమియర్ షోకు అధికారికంగా అత్యధిక టికెట్ ధర కలిగి ఉన్న సినిమా కూడా ‘ఓజీ’ చిత్రమే కావడం విశేషం. అంతేకాదు..ఓ సినిమా రిలీజ్‌కు 8 రోజులు ముందే, టికెట్ హైక్స్ రావడం ఇదే తొలిసారి కావొ చ్చెమో.
AP – #PawanKalyan Movie #OG Ticket Hike.. #TheycalllHimOG #Pawanakalyan#PriyankaMohan
1 AM show ticket cost – 1000
5 shows per day.
Single screen ticket hike – 125 rs
Multiplex tiket hike – 150 rs pic.twitter.com/HkpXVo8MQc— TollywoodHub (@tollywoodhub8) September 17, 2025
పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంపు..
సింగిల్ స్క్రీన్స్‌లో ఓజీ సినిమాకు అదనంగా రూ. 125 రూపాయలు పెంచుకోవచ్చు. మల్టీ ఫ్లెక్స్‌లలో రూ. 150 రూపాయలు పెంచుకోవచ్చు. ఓజీ సినిమాకు చెంది పెరిగిన టికెట్ ధరలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు అమలులో ఉంటాయి. ఇంకా తెలంగాణ జీవో రావాల్సి ఉంది. ప్రజెంట్ ‘ఓజీ’ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే, కలెక్షన్స్ అమాంతం పెరిగిపోతాయి. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రంగా ‘ఓజీ’ నిలవొచ్చు.
పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా
పవన్‌కల్యాన్ ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య, దాసరి కిరణ్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ చేశాడు. శ్రియా రెడ్డి, అర్జున్‌దాస్‌లు (OG Movie cast and crew) ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. నేహాశెట్టి ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ చేశారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ సినిమా కథ ప్రధానంగా 1980 నుంచి 1990 టైమ్‌లైన్‌లో సాగుతుంది.