Pawankalyan with AnilRavipudi: పవన్‌కల్యాణ్ పెండింగ్ మూవీ ‘హరిహరవీరమల్లు, ఓజీ (ఓజాబ్ గంభీర)’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా, పవన్‌కల్యాణ్ మాత్రం కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు పవన్‌కల్యాణ్ నెక్ట్స్ సినిమా ఎవరితో? అన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. మొన్నామధ్య…పవన్‌తో ఆల్రెడీ ‘బ్రో’ సినిమా తీసిన, సముద్రఖని మళ్లీ పవన్‌తోనే మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారన్న వార్త తెరపైకి వచ్చింది. అలాగే పవన్‌కల్యాణ్ కోసం ఆయన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ మరో రీమేక్ కథను సిద్ధం చేయిస్తున్నాడన్న వార్తలు లేకపోలేదు.
ఈ పుకార్లు ఇలా ఉండగానే పవన్‌కల్యాన్ కాల్షీట్స్‌ను కలెక్ట్ చేశారట నిర్మాత ‘దిల్’ రాజు. ఇటీవల జరిగిన ఓజీ సక్సెస్‌మీట్‌లో ఓ సినిమా కోసం పవన్‌ను సంప్రదించగా, పవన్ సుముఖత వ్యక్తం చేశారట. దీంతో పవన్ కోసం ఓ మంచి కథ, దర్శకుడిని ఏర్పాటు చేసే పనిలో పడ్డారట ‘దిల్’ రాజు. అయితే రీసెంట్ టైమ్స్‌లో పవన్ ఎక్కువగా సీరియస్ సినిమాలే చేశారు. అలా కాకుండ…ఈ సారి కాస్త సరదా సినిమా చేయాలని ‘దిల్’ రాజు భావిస్తున్నారట.
దీంతో దర్శకుడు అనిల్‌రావిపూడి– పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో ఉన్నారట దిల్ రాజు. అనిల్ రావిపూడి ప్రజెంట్ చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే సినిమా చేస్తున్నాడు. అనిల్ నెక్ట్స్ మూవీపై ఇంకా క్లారిటీ లేదు. అనిల్‌తో మంచి అసోసియేషన్ ఉన్న వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో పవన్‌తో సినిమా చేసే వస్తే అనిల్‌రావిపూడి కాదనలేరు. పైగా తనకు ఇండస్ట్రీలో అండగా ఉన్న ‘దిల్’ రాజు నుంచి ఆర్డర్ వస్తే అనిల్ నో అనే చాన్సెస్ తక్కువ. మరి..పవన్– అనిల్ రావిపూడిల కాంబో సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.