నాగార్జున వందో సినిమా టైటిల్‌ మారిందా?

Viswa
Nagarjuna 100th film Titled as Lottery King

Web Stories

Nagarjuna 100th film: టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున వందో సినిమా కోసం ఎప్పట్నుంచో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు ఆర్‌.ఏ కార్తీక్‌ తన కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడని, ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో నాగా ర్జున పేర్కొన్నారు. అయితే ఈ సినిమాకు ‘కింగ్‌ 100 నాటౌట్‌’ అనే టైటిల్‌ను అనుకుంటు న్నారనే ప్రచారం సాగింది. కానీ ఈ సినిమాకు తాజాగా ‘లాటరీ కింగ్‌’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

అలాగే నాగార్జున వందో సినిమా కనుక, ఈ సినిమాలో అక్కినేని అఖిల్, నాగచైతన్యలు కూడా కనిపించే అవకాశం లేకపోలేదని, నాగార్జున వందో చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ కనిపిస్తార నే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారం భించనున్నారట మేకర్స్‌. అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌ హౌస్‌ బ్యానర్‌లోనే ఈ సినిమా నిర్మించబ డుతుందట. కాగా, ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక నాగార్జున నటించిన కల్ట్‌క్లాసిక్, ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘శివ’ నవంబరు 14న అత్యా« దునిక సాంకేతిక విలువలతో రీ రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos