Baahubali3: బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా విడుదలై, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా విడుదలై, పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను కలిపి ఒకే పార్టుగా ‘బాహు బలి: ది ఎపిక్’గా ఈ అక్టోబరు 31న రిలీజ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది… కానీ సడన్‌గా…ఇప్పుడు ‘బాహుబలి 3’ సినిమా తెరపైకి వచ్చింది.
ఇటీవలి కాలంలో ఓ సినిమా ఎండింగ్లో నెక్ట్స్ పార్ట్ ఉంటుందని చెప్పడం చాలా మామూలైపో యింది. ఇప్పుడు ఫ్రాంచైజీ సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి టాలీవుడ్లో. ఈ క్రమంలో ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా చివర్లో ‘బాహుబలి 3’ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని, లేదా క్లిప్హ్యాంగర్ను వదలుతారనే టాక్ టాలీవుడ్లో తెరపైకి వచ్చింది.
పైగా ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా కోసం స్వయంగా రాజమౌళియే పూనుకుని, ఈ సినిమా ఎడిట్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే…ఆడియన్స్ ఊహించిన సర్ప్రైజ్ అయితే ఏదో ఒకటి ‘బాహుబలి ది ఎపిక్’లో ఉండే అవకాశాలైతే ఉండే చాన్సెస్ మెండుగా కనిపిస్తున్నాయి.
మరోవైపు ‘బాహుబలి’ సినిమాలోని ఓ ప్రధాన పాత్ర అయిన కట్టప్ప ఆధారంగానే విజ యేంద్రప్రసాద్ ఓ సినిమా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి..తరుణంలో ‘బాహుబలి 3’ని గురించిన ప్రస్తావన రావడం కూడా చర్చనీయాంశమైంది. ఒకవేళ బాహుబలి 3 అనౌన్స్మెంట్ ఉంటే కనుక, ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే. ఇండియన్ బాక్సాఫీస్‌కు మరోసారి షేకే.