AlluArjun PushpaTheRule Review: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పుష్ప 2’. వీరి కాంబినేషన్‌లోనే 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లు కలిసి ‘పుష్స’కు సీక్వెల్‌గా ‘పుష్ప 2 ది రూల్’ను స్టార్ట్ చేశారు. రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు బుక్కైన టికెట్ల రూపంలో వంద కోట్ల రూపాయలు వచ్చాయి. 420 కోట్ల రూపాయలు నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 12500 స్క్రీన్స్‌లో, ఆరు భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. మరి..’పుష్స ది రూల్’ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోగలిగిందా? రివ్యూలో చదివేయండి (AlluArjun PushpaTheRule Review).
కథ
ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ రారాజుగా ఉన్న పుష్పరాజ్ (AlluArjun) ముఖ్యమంత్రితో ఓ ఫోటో దిగాలనుకుంటాడు. కానీ ఓ స్మగ్లర్‌తో ఫోటో దిగేందుకు ముఖ్యమంత్రి అవమానంగా ఫీలవుతాడు. దీంతో పుష్పరాజ్ ఈగో దెబ్బతింటుంది. ప్రస్తుత సీయంను దించి, సిద్దప్ప (రావు రమేష్)ను సీయం చేయాలనుకుంటాడు పుష్ప రాజ్. మరోవైపు పుష్పరాజ్ స్మగ్లింగ్ ఎత్తుగడలను అడ్డుకుంటుంటాడు బన్వర్‌సింగ్ షెకావత్. దీంతో సిండికేట్ లాభాలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పుష్పరాజ్– బన్వర్‌సింగ్ షెకావత్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు ఓ పార్టీ ఏర్పాటు చేస్తాడు సిద్దప్ప. ఈ పార్టీలో పుష్పరాజ్, బన్వర్‌సింగ్ షెకావత్‌ల ఈగో క్లాసెష్ తారా స్థాయికి చేరతాయి. ఇంటర్‌నేషనల్ స్థాయిలో స్మగ్లింగ్ చేస్తానని బన్వర్‌సింగ్‌తో పుష్పరాజ్ సవాల్ చేస్తాడు. చేయనివ్వనని పుష్పరాజ్‌కు చాలెంజ్‌లు విసురుతాడు బన్వర్‌సింగ్ షెకావత్. ఇదిలా ఉండగానే మరోవైపు తన అన్నయ్య (పుష్పరాజ్ తండ్రి మొదటిభార్య కొడుకు) మోహన్‌రాజా (అజయ్) కుటుంబం చిక్కుల్లో పడుతుంది. మరి.. సిద్దప్పను పుష్పరాజ్ సీయం చేయగలిగాడా? మంగళం శీను (సునీల్), దాక్షాయణి (అనసూయ), బన్వర్‌సింగ్ షెకావత్‌లు పుష్పరాజ్‌ను ఏ విధంగా దెబ్బ తీయా లనుకున్నారు? తన తండ్రి రెండో భార్య కొడుకైన పుష్పరాజ్‌కు ఇంటిపేరును ఇచ్చేందుకు మోహన్‌రాజా ఒప్పుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథనం.

AlluArjun PushpaTheRule Review: విశ్లేషణ
ఇంటిపేరు సంపాదించుకుని ఆత్మగౌరవం నిలుపుకోవడం, ఈగో, కుటుంబం గౌరవం…ఈ అంశాల చూట్టే కథను తిప్పాడు దర్శకుడు సుకుమార్. జపాన్ ఎపిసోడ్‌లోని ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ‘పుష్ప: ది రూల్’ కథ మొదలవుతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో తన వారిని పుష్పరాజ్ విడిపించుకోవడం, సీఎం ఫోటో సీన్, పుష్పరాజ్, బన్వర్‌ల మధ్య రాజీ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో ఈగో సీన్స్, ఫీలింగ్ సాంగ్స్‌తో తొలిభాగం ముగుస్తుంది. మధ్యలో ఇంటిపేరు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ కూడా ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో పుష్పరాజ్ ఇంటర్‌నేషనల్ స్థాయిలో ఓ స్మగ్లింగ్ డీల్ చేయడంతో కథ మొదలువుతుంది. ఆ వెంటనే జాతర సన్నివేశం ఉంటుంది. ఆల్మోస్ట్ 20 నిమిషాల వరకూ ఉండే జాతర సీన్ ఆడియన్స్‌ను అలరిస్తుంది. ము ఖ్యంగా ఈ సీన్స్‌లో బన్నీ డ్యాన్స్, స్వాగ్ అదిరిపోతాయి. కానీ సుకుమార్ ఇక్కడే తడబడ్డాడనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనుకున్న పుష్పరాజ్ లక్ష్యం పక్కదారి పట్టి, ఫ్యామిలీ బాండింగ్స్ వైపు టర్న్ తీసుకుంటుంది. ఈ సీన్స్ అంతా ఆసక్తిగా అనిపించక పోవచ్చు. కానీ రష్మికతో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం ఆడియన్స్‌ను ఒకింత మెప్పిస్తాయి. క్లైమాక్స్‌ను చెప్పే విధానం రోటీన్‌గానే ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ చూడ్డానికి బాగానే ఉన్నా రియలిస్టిక్‌గా అనిపించదు. సెకండాఫ్‌లో కొంత ప్రేక్షకుల ఊహకు తగ్గట్లుగానే కథ సాగుడం మరో మైనస్. పుష్ప 3 ర్యాంపేజ్ క్లిఫ్ హ్యాంగర్ కూడా ఆసక్తికరంగా అనిపించదు.
చూస్తుంటే దర్శకుడు కథలోని క్లాన్‌ఫ్లిక్ట్‌ని డిజైన్ చేసుకోవడం కన్నా కూడా..హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేషన్స్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టాడెమో అనిపిస్తుంది. పోలీస్‌స్టేషన్ సీన్, సీయం దగ్గర ఫోటో సీన్, లారీ ఛేజింగ్ సీక్వెన్స్, జాతర సీన్, క్లైమాక్స్ ఫైట్….ఇలా ఎంతసేపు హీరో క్యారెక్టరై జేషన్‌పైనే సుకుమార్ ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఫ్యామిలీ సీన్స్ ఊహకు తగ్గట్లు ఉంటాయి. స్మిమ్మింగ్‌ఫూల్ సీన్, ఫుష్ప వైల్డ్ ఫైర్ సీన్‌లో ఫాహద్ క్యారెక్టర్ ఓ కమేడియన్ తరహాలో ఉంటుంది. మంగళం శీను క్యారెక్టర్‌కు సడన్‌గా ఇంపార్టెన్స్ పడిపోతుంది. సెకండాఫ్‌లో ఓ అరగంట ఆడి యన్స్‌కు బోరింగ్‌గా అనిపించవచ్చు. కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. బహుశా…సుకుమార్‌లోని బలమైన రచయిత ఎడిటర్ నవీన్‌కు కత్తెరను అడ్డుకుని ఉంటాడు కాబోలు. క్యూబా కెమెరా ఒకే. సూసికీ సాంగ్ మిస్ ప్లేస్ అయినట్లుగా అనిపిస్తుంది. జగపతిబాబు క్యారెక్టరైజేషన్ సరిగా ఎస్టాబ్లిష్ కాదు. జపాన్ ఏపిసోడ్‌పై సరైన స్పష్టత ఉండదు. సినిమా నిడివి పెద్ద ప్రాబ్లమ్ కాదని నిర్మాత నవీన్ చెప్పారు. కానీ అది అబద్దమని సినిమా చూసిన ఆడియన్స్‌ను ఒక్కసారైనా గుర్తుకు రావొచ్చు.

పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్పుకోవడంలో ఏ మాత్రం సందేహం లేదు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, యాక్షన్ సీక్వెన్స్, రష్మికతో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో అల్లు అర్జున్ యాక్టింగ్, స్వాగ్, స్టైల్, సాంగ్స్‌లోని స్టెప్స్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టిస్తాయి. శ్రీవల్లిగా రష్మిక పాత్రకు ఈ సారి మంచి ఇంపాక్ట్ కుదిరింది. జాతర సీన్‌తో అజయ్‌తో వచ్చే ఓ సన్నివేశంలో రష్మిక పాత్రలో ఓ మాస్ ఈజ్ కనిపిస్తుంది. సెకండాఫ్‌లోని కొంత ఎమోషన్‌ను కూడా రష్మిక పాత్రే మోస్తుంది. ఇక బన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫాహద్‌ఫాజిల్‌కు ఆల్మోస్ట్ హీరోతో సమానమైన పాత్ర దక్కిందనే చెప్పుకోవాలి. కానీ ఫాహద్‌ను దర్శకుడు సుకుమార్ అతని స్థాయి యాక్టింగ్‌ను తీసుకోలేకపోయాడనిపిస్తుంది. సిద్ధప్ప పాత్రలో రావు రమేష్, రెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించారు. కానీ జగపతిబాబు పాత్ర పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కానీ ఫీలింగ్ కలుగుతుంది. ఒక తారక్ పొన్నాప్ప పాత్రకు ఉన్న నిడివి తక్కువే. కానీ కథలో వచ్చే మలుపులకు, కథను ముందుకు తీసుకువెళ్లడంలో ఈ పాత్ర చాలా కీలకంగా అనిపిస్తుంది. ఇక స్పెషల్‌సాంగ్‌లో ‘కిస్సిక్’లో శ్రీవల్లి డ్యాన్స్‌మూమెంట్స్ అదుర్స్ అనే చెప్పాలి. ఓ దశలో అల్లు అర్జున్‌ను శ్రీవల్లి డ్యాన్స్‌లో డామినేట్ చేస్తుందా? అనిపిస్తుంది. అజయ్, అనసూయ, సునీల్ పాత్రలు ఉన్న పరిధిలో చేశారు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు వర్కౌట్ అయ్యింది. జాతర ఎపిసోడ్‌కు సామ్‌సీఎస్ ఇచ్చిన ఆర్‌ఆర్ బాగానే ఉంది. అయితే ఊ అంటా వా…రేంజ్‌లో మాత్రం కిసిక్ అయితే లేదనిపించవచ్చు. కెమెరా వర్క్ ఒకే. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు సినిమా అంతా హీరో క్యారెక్టరైజేషన్‌పైనే కాకుండా…మిగిలిన పాత్రలు, కథపై కూడా పెడితే బాగుండేది. హీరో పక్క పాత్రలు, కథ బాగున్నప్పుడే హీరో క్యారెక్టరైనేషన్ ఎలివేట్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో మధ్య కథ ఉంటే బాగోదు. కథలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటే బాగుంటాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్‌కు అయితే ఈ సినిమాను మరింత ఇష్టపడతారు.
చివరిగా: ‘పుష్ప’ వైల్డ్ ఫైర్ కాదు…నార్మల్ ఫైర్.
NagaChaitanya Weds SobhitaDhulipala: నాగచైతన్య జీవితం శోభితం