KiranAbbavaram KRamp: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కె–ర్యాంప్’. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 18న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.
ఏం బాబు ఏంసెట్ ఏగ్జామ్ రాయలేదటగా…. (గోపరాజు రమణ)
తాగి పడిపోవాల్సి వచ్చింది (కిరణ అబ్బవరం)
వాడి అమ్మ బతికి ఉంటే వాడు ఇలా అయ్యేవాడు కాదు..(సాయికుమార్)
లైఫ్‌లో ఒక్కసారైన డబ్బున్నోడిలా బిహేవ్ చేయ్‌రా..!
లవ్ చేస్తే లైఫ్ ఇస్తానని వరమిచ్చాన్ సార్…(కిరణ్ అబ్బవరం)
ఐ లవ్ యూ కుమార్…నువ్వు చెప్పుకుమార్..(యుక్తీ తరేజా)
….ఈ డైలాగ్స్ ‘కె–ర్యాంప్’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.
యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అలీ, శ్రీనివాసరెడ్డి, వీకే నరేశ్, సాయి కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జైన్స్ నాని ఈ సినిమాకు దర్శకుడు. రాజేష్ దండా, శివబొమ్మకు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సహ–నిర్మాత బాలాజీ గుట్ట.