కిరణ్‌ అబ్బవరం కె-ర్యాంప్‌ రివ్యూ…లవర్‌ చిటికి మాటికి సూసైడ్‌ చేసుకుంటానంటే…!

Viswa
KiranAbbavaram K Ramp Movie Review

Web Stories

సినిమా: కె–ర్యాంప్‌ (KiranAbbavaram Kramp Review)
ప్రధాన తారాగణం: కిరణ్‌ అబ్బవరం, యుక్తీ తరేజా, సాయికుమార్, వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్‌
దర్శకత్వం: జైన్స్‌ నాని (నూతన పరిచయం)
నిర్మాతలు: రాజేష్‌ దండా, శివ బొమ్మక్‌
సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌
ఎడిటింగ్‌: చోటా కే ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సతీష్‌ రెడ్డి మాసం
నిడివి: 2 గంటల 20 నిమిషాలు
విడుదల తేదీ: 18–10–2025
రేటింగ్‌: 2.5/5

కథ

కుమార్‌ (కిరణ్‌ అబ్బవరం) రిచ్‌ కిడ్‌. దీంతో చదువును నెగ్లెట్‌ చేసి, అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. మిడిల్‌ క్లాస్‌ జల్సా లైఫ్‌ను లీడ్‌ చేస్తుంటాడు. దీంతో కుమార్‌ తండ్రి (సాయికుమార్‌), అతన్ని పై చదువుల కోసం కర్ణాటక పంపిస్తాడు. అక్కడ మెర్సి జాయ్‌ (యుక్తీ తరేజా) తో కుమార్‌ లవ్‌లో పడతాడు. మెర్సిజాయ్‌ కూడ కుమార్‌ను లవ్‌ చేస్తుంది. కానీ మెర్సి జాయ్‌కి ఓ హెల్త్‌ ప్రాబ్లమ్‌ ఉంటుంది. ఏవరైనా తనకు ఏదైనా ప్రా మిస్‌ చేసి, ఆ ప్రామిస్‌ను బ్రేక్‌ చేస్తే సూసైడ్‌ అటెంమ్ట్‌ చేస్తుంది. ఇలా మెర్సి జాయ్‌ వైఖరితో విసిగిపోయిన కుమార్‌ ఆమెకు బ్రేకప్‌ చెప్పాలను కుంటాడు. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది? కుమార్‌ తన లవర్‌ మెర్సి జాయ్‌ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అసలు… మెర్సిజాయ్‌ గతం ఏమిటి? అన్నది మిగిలిన ‘కె–ర్యాంప్‌’ స్టోరీ (KRampReview).

KRamp Story:విశ్లేషణ

‘కె–ర్యాంప్‌’ అల్లరి చిల్లరిగా తిరిగే ఓ కుర్రాడి కథ. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌నే లక్ష్యంగా చేసుకుని, ఈ సినిమా తీసినట్లుగా ఉంది. లవ్‌ ట్రాక్‌లో పెద్ద ట్విస్ట్‌లు గట్రా ఏమీ లేదు. కానీ కథ సాగుతున్నంత సేపు ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ అవుతారు. అదే ఈ సినిమాకు బలం. లా జిక్‌లు గట్రా అయితే ఏమీ ఆలోచించవద్దు. అయితే పనిలో పనిగా ఓ చిన్న మెసేజ్‌ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్‌.

కుమార్‌ కర్ణాటకకు వెళ్లి, అక్కడ మెర్సి జాయ్‌తో ప్రేమలో పడి, ఆమెను కూడ తన ప్రేమలో పడే యడంతో తొలి భాగం ముగుస్తుంది. మెర్సిజాయ్‌కు ఉన్న ప్రాబ్లమ్‌ తెలిసిన తర్వాత కుమార్, ఆమెను ఎలా వదిలించుకోవాలనుకున్నాడు? ఈ క్రమంలో తన తండ్రి ప్రేమను ఎలా అర్థం చేసుకోగలిగాడు? మెర్సిజాయ్‌ని ఎలా రక్షించుకోగలిగాడు? అన్న సీన్స్‌తో సెకండాఫ్‌ ముగుస్తుంది. క్లైమాక్స్‌ కూడ ఒకే.

ఈ సినిమాలో విజువల్స్‌ పరంగా ఎక్కడ పెద్దగా వల్గారిటీ లేదు కానీ..డైలాగ్స్‌ పరంగ ఒకింత ఇబ్బంది అయితే ఉంది. అందుకే ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఈ డైలాగ్స్‌ ఈ జెన్‌ జెడ్, సోషల్‌ మీడియా యూజర్లు వాడే బూతు పదాలే. కొత్తవి అయితే ఏం లేవు. మాస్‌ ఆడి యన్స్‌కు తగ్గ పాటలు, ఫైట్స్‌ కూడా ఉన్నాయి. కథ రోటీన్‌. స్క్రీన్‌ ప్లే రోటీన్‌. జస్ట్‌ ఎంటర్‌టైన్‌ మూమెంట్స్‌ అంతే. అలాగే సినిమా హీరో ఆద్యంతం తాగుతూ ఉండటం కూడా కరెక్ట్‌గా అనిపించలేదుజ

నటీనటులు-సాంకేతిక నిపుణులు

ఈ సినిమాకు ప్రధాన బలం కిరణ్‌ అబ్బవరం యాక్టింగ్‌. సినిమా టైటిల్‌కు తగ్గట్లే, మూవీ అం తా కిరణ్‌ అబ్బవరం యాక్టింగ్‌ ర్యాంప్‌ కనిపిస్తుంది. కామెడీ టైమింగ్‌లో కిరణ్‌ కాస్త మెరుగ య్యాడు. ఉన్న ఒకట్రెండు ఎమోషనల్‌ సీన్స్‌లో పాత కిరణే కనిపిస్తాడు. మొత్తం గా యాక్టర్‌గా అయితే కిరణ్‌ కాస్త బెటర్‌ పెర్ఫార్మెన్స్‌ అయితే ఇచ్చాడు. ఈ సినిమాలో రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్ర కాకుండ, ఓ డిఫరెంట్‌ రోల్‌ చేసింది యుక్తీ తరేజా. కొన్ని సీన్స్‌లో అయితే హీరోనే డామి నేట్‌ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సాయికుమార్‌ మరో రోటీన్‌ ఫాదర్‌ రోల్‌ చేశాడు. హీరోయిన్‌ పెదనాన్నగా మురళీధర్‌ గౌడ్‌ పెర్ఫార్మెన్స్‌ ఒకే. హీరో మామయ్యగా వీకే నరేశ్‌ ట్రాక్‌ ఒకే. కానీ ఈ పాత్ర నుంచి ఓ సందేశం ఉండటం బాగుంది. సెకండాఫ్‌లో ఓ మంచి ట్రాక్‌ పడింది వీకే నరేశ్‌కి. ఇక ఇంట్రవెల్‌ తర్వాత వచ్చే వెన్నెల కిశోర్‌ ఎపిసోడ్‌ నిరుత్సాహ పరచదు. అలీ, శ్రీనివాస రెడ్డి, అజయ్, విమలారామన్, కామ్నా జఠ్మాలానీ…వారి వారి పాత్రల మేరకు, గెస్ట్‌ రోల్స్‌ మాదిరి కనిపించారు.

జైన్స్‌ నాని డైరెక్షన్‌ ఒకే. కేవలం సినిమాలోని మూమెంట్స్‌పైనే కాకుండ, స్క్రీన్‌ప్లే పై కూడా కాస్త ఫోకస్‌ పెట్టి ఉండాల్సింది. తొలి సినిమా కనుక, లెర్నింగ్‌ ప్రాసెస్‌ అనుకోవచ్చు. నిర్మాతలు రా జేష్‌ దండా, శివ బొమ్మకు నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. చేతన్‌ మ్యూజిక్‌ బాగా కుదిరింది. ఆర్‌ఆర్‌ సౌండ్‌ చేసింది.

ఫైనల్‌గా: జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం అయితే ‘కె–ర్యాంప్‌’ సినిమాను చూడొచ్చు. కానీ సెన్సార్‌ వాళ్లు ‘ఏ’సర్టిఫికేట్‌ ఇచ్చారని గుర్తు పెట్టుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడొచ్చు. కానీ చిన్నపిల్లలతో కలిసి సినిమా చూడటం కాస్త ఇబ్బందే.

బడ్డీ కామెడీ మిత్రమండలి సినిమా రివ్యూ

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos