సినిమా: థామా (Thamma Review In Telugu)
ప్రధాన తారాగణం: ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా, పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఫైసల్ మాలిక్
దర్శకుడు: ఆదిత్య సర్పోత్ధార్
నిర్మాతలు: దినేష్ విజన్, ఆమర్ కౌశిక్
సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి
ఎడిటింగ్: హేమంత్ సర్కార్
సంగీతం: సచిన్–జిగర్
నిడివి: 2 గంటల 30 నిమిషాలు
విడుదల తేదీ: 21–10–2025
రేటింగ్: 2.5/5
Thamma Review: కథ
ఆజాద్ న్యూస్ రిపోర్టర్ అలోక్ గోయల్. ఓ సారి ట్రెక్కింగ్ కోసమని, అడవికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఈ ప్రమాదం నుంచి అలోక్‌ను భేతాళిని తడ్కా రక్షిస్తుంది. ఇది భేతాళ నాయ కుడు యక్షాసాన్ అనుచరుడు వీరన్‌కు నచ్చదు. అలోక్‌ను పట్టుకుని, యక్షాసాన్‌కు ఆహారంగా వేస్తాడు. యక్షాసాన్‌ను నుంచి అలోక్‌ను తడ్కా మళ్లీ రక్షిస్తుంది. కానీ అలోక్‌తో కలిసి తడ్కా ఢిల్లీ వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో తడ్కాను అలోక్ ప్రాణంగా ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అలోక్‌ను తడ్కా తన లాగే భేతాళుడిగా మార్చే స్తుంది. మరి…ఆ తర్వాత ఏం జరిగింది. ప్రేమిం చిన అలోక్‌ను తడ్కా ఎందుకు భేతాళుడిగా మార్చాల్సి వచ్చింది? భేతాళ నాయకుడు యక్షా సాన్‌కు శాప విమోచనం కలిగిందా? అలోక్ భేతాళుడిగా మారిన తర్వాత, అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి? అసలు..భేతాళులు ఎవరు? వీరు జీవించడానికి రక్తాన్నే ఎందుకు తాగుతారు? అనేది థియేటర్స్‌లో చూడాలి.
Thamma Movie Review:విశ్లేషణ
‘స్త్రీ, స్త్రీ2, ముంజ్యా’ వంటి సినిమాల తర్వాత మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చి న తాజా చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి గతంలో వచ్చిన సిని మాల్లో ఎక్కువగా హారర్ ఎలిమెంట్స్ ఉంటే, ఈ ‘థామా’ సినిమాలో మాత్రం దర్శకుడు ఆది త్య, ఎక్కువగా లవ్‌స్టోరీపై ఫోకస్ పెట్టాడు.
భేతాళుల నాయకుడిని ‘థామా’ అంటారు. ఈ భేతాళుల కొత్త ‘థామా’ ఎవరు? అన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఈ అంశాన్నే లవ్ కోణంలో తీసుకు వెళ్లాడు దర్శకుడు.
320 బీసీ అంటూ ఈ సినిమా కథ మొదలవుతుంది. ప్రారంభ సన్నివేశాలతో సినిమా కాస్త స్లోగానే నడుస్తుంది. కానీ ఎప్పుడైతే భేతాళుడిగా అలోక్ మారతాడో, అప్పట్నుంచి కథ వేగం పెరుగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ‘భేడియా’ ఎంట్రీ, అలోక్ – భేడియాల మధ్య చేంజింగ్ సీన్, ఈ రెండు పాత్రల మధ్య ఉన్న కనెక్షన్స్ ఆకట్టుకునేలా ఉన్నా యి. కానీ వీటిని సరిగ్గా, కన్విన్సింగ్‌గా ప్రజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. సాధారణ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది కానీ, హారర్ సినిమాలు చూసే ఆడియన్స్‌కు ఈ ‘థామా’ సినిమా ఇంట్రవెల్, క్లైమాక్స్ ఎగై్జట్ చేయవు. కానీ మడాక్ ఫిల్మ్ యూనివర్స్ కోసం వదలిన లీడ్ ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక ఫస్టాప్‌లో వచ్చే మలైకా అరోరా స్పెషల్ సాంగ్, సెకండాఫ్‌లో వచ్చే నోరా ఫతేహా స్పెషల్ సాంగ్, పోస్ట్ క్రెడిట్స్‌లో వచ్చే రష్మిక–ఆయుష్మాన్‌ల ప్రమోషనల్ సాంగ్స్…ఆడియన్స్‌కు కాస్త రిలీఫ్‌ని ఇస్తాయి. కథలో ఈ పాటలకు ఏమి ప్రాముఖ్యత అయితే లేదు. అలాగే లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడంలో నాలుగైదు కిస్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎందుకో దర్శకుడికే తెలియాలి.
నటీనటులు- సాంకేతిక నిపుణులు
అలోక్ గోయెల్‌గా ఆయుష్మాన్ ఖురానా (Thamma Ayushmann Khurrana) యాక్టింగ్ ఒకే. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయుష్మాన్ నటించడానికి స్కోప్ దొరికింది. ఇక తడ్కా పాత్రలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) యాక్టింగ్ బాగుంది. అలోక్ తండ్రిగా పరేష్ రావల్ కాస్త కామెడీ ట్రై చేసినా, వర్కౌట్ కాలేదనిపిస్తుంది. ్రస్క్రీన్‌పై నిడివి తక్కువగా ఉన్నా, ఇన్‌స్ఫెక్టర్‌గా ఫాజల్ మంచి రోల్ లభించింది. యక్షాసాన్‌గా నవా జుద్దీన్ సిద్ధిఖీ ఒకే. చాలా వరకు ఈ పాత్రను కామెడీగానే చూపించారు. ఉన్న కొంచెం సేపు స్క్రీన్ పై వరుణ్ దావన్, సత్య రాజ్ మెప్పించారు. ‘స్త్రీ’ ఫేమ్ అభిషేక్ బెనర్జీ కనిపించారు.
క్లైమాక్స్‌లో కూడా ఇదే తీరు. దీంతో హారర్ ఎలిమెంట్స్ లోపించినట్లుగా అనిపిస్తుంది. మిగిలినవారు వారి వారి పాత్ర ల మేరకు నటించారు. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. సంగీతం ఒకే. ఆర్‌ఆర్ అక్కడక్కడా బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా…: మడాక్ హారర్ కామెడీ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన ‘థామా’ సినిమాలో సరైన కామెడీ లేదు. హారర్ లేదు. రెగ్యులర్ లవ్‌స్టోరీ మాత్రమే ఉంది. ఇక రోటీన్ హారర్ లవ్‌స్టోరీ చూసిన అనుభవం కలుగుతుంది ‘థామా’ సినిమాను చూస్తే. హారర్ సినిమాలను ఫాలో అయ్యేవారు పెద్దగా ఎగై్జట్ కాలేరు. సాధారణ ఆడియన్స్ ఓ సారి చూడొచ్చు.