Mogli Teaser: రోషన్ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ 2025’. ఈ చిత్రంలో సాక్షి మండోల్కర్ హీరోయిన్‌గా నటించగా, బండి సరోజ్‌కుమార్, హర్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటించగా, హర్ష ఈ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ (Mogli Teaser)ను హీరో ఎన్టీఆర్ లాంచ్ చేశారు. ఈ టీజర్‌లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి.
మనకెందుకు మాయ్యా…ఈ కోపాలు అన్నీ…పావుగంట ఆపకుండ నవ్వావంటేనే బుగ్గలు నొప్పేచ్చేస్తాయి. అలాంటిది జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఎలా చెప్పు…!
మగాడిగా పుట్టడం పెద్ద దరిద్రం రా..ఏడుపొస్తే వాళ్ల ముందు ఏడవలేము..నొప్పొస్తే..వాళ్ల ముందు చూపించుకోలేము..ఉచ్చొస్తే…ఎక్కడపడితే అక్కడ పోసేయచ్చనే వరం తప్పితే..దేనికి పనికిరాని బతుకులు మాయ్యా..మనవి..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.