Akhanda2 Trailer{ ‘సింహా, లెజెండ్, అఖండ’…ఇలా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌తో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. తాజాగా ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ2: తాండవం’ సినిమా రూపుదిద్దుకుంది. ‘అఖండ’ సినిమాకు పర్‌ఫెక్ట్ సీక్వెల్‌గా ఈ చిత్రం రానున్నట్లుగా తెలుస్తోంది. ‘అఖండ2: తాండవం’ సినిమా డిసెంబరు 5న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను (Akhanda2 Trailer) మేకర్స్ రిలీజ్ చేశారు.
‘కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి..అలా వాళ్లు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలు అయిపోతుంది….
‘‘ఎనిమిది కంఠాలు తెగాలి..రక్తం చిందాలి’
‘‘నేను చనిపోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది…’’
‘‘ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం..ఈ దేశంలో మీరు ఏటు చూసినా కనిపించేది ఒక ధర్మం..సనాతన హైంధవ ధర్మం…
‘దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు..దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం..మీ భాషలో చెప్పాలంటే….సర్జికల్ స్ట్రైక్..’
ఇప్పటివరకు ప్రపంచపటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసి ఉంటావ్..ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసి ఉండవ్…మేమోకసారి లేచి శబ్దం చేస్తే…ఈ ప్రపంచమే నిశ్శబ్ధం….
ట్రైలర్‌ని బట్టి చూస్తూ, ఈ సినిమాలో సనాతన హైంధవ ధర్మం, దేశభక్తి, భక్తి, కశ్మీర్ బ్యాక్ డ్రాప్, విదేశీయుల కుట్ర, దుష్టశక్తులు…వంటి అంశాల మేళివింపుతో ‘అఖండ2: తాండవం’ సినిమా ఉండబోతున్నట్లుగా స్పష్టం అవుతోంది. మరి…‘అఖండ’ సినిమా క్రియేట్ చేసిన, హిట్ మ్యాజిక్‌ను ‘అఖండ2’ కూడా క్రియేట్ చేస్తుందా? అనేది చూడాలి. ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి ఓ విలన్ రోల్ చేస్తున్నాడు. సంయుక్త, హర్షాలీ మల్హోత్రా…లు ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్ర ల్లో నటించారు.