Rashmika Mandanna: ‘ది గార్ల్‌ఫ్రెండ్’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. రష్మికా మందన్నా మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో దీక్షిత్‌శెట్టి మరో లీడ్ రోల్‌లో నటించారు. ఓ మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘చిలసౌ, మన్మధుడు 2’ వంటి సినిమాలకు దర్శకత్వంవహించిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తీస్తున్నారు. గీతాఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై ధీరజ్ మోగిలినేని, విద్యా కొప్పినీడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటస్ట్‌గా ఈ సినిమా టీజర్ విడు దలైంది. ఈ సినిమా టీజర్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
మళ్లీ హీరో హీరోయిన్లుగా విజయ్, రష్మికా మందన్న
ఇక గతంలో ‘గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు విజయ్ దేవకరొండ, రష్మికా మందన్నా. మరోసారి వీరిద్దరు జోడీగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.‘టాక్సీవాలా’ చిత్రం తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మరో
సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా నటించనున్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.