Balakrishna Akhanda2 Release Postponed: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లోని తాజా చిత్రం ‘అఖండ 2 ‘ సినిమా విడుదల వాయిదా పడింది. ఈరోజు.. అంటే డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్టుగా మేకర్స్ ఆఫీసియల్ గా గురువారం రాత్రి 11 గంటల తర్వాత వెల్లడించారు. రిలీజ్ కు ఒక్క రోజు ముందు సినిమా విడుదల వాయిదా పడటంతో, బాలకృష్ణ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సూపర్ హిట్ మూవీస్, తర్వాత బాలకృష్ణ నుంచి రావాల్సిన అఖండ 2 సినిమా, రిలీజ్ కు కొన్ని గంటల ముందు వాయిదా పడటం అనేది, బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఇబ్బంది కరమైన విషయామనే చెప్పాలి.

మరోవైపు ఈ చిత్ర నిర్మాణ సంస్థ 14ఫ్లస్ రిల్స్ సంస్థ కు ఉన్న ఆర్ధిక పరమైన కారణాల వాళ్లే, అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడిందనే వార్తలు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నాయి.
టికెట్ రేట్స్ హైక్ ని, కన్ఫర్మ్ చేసుకుని, ప్రీమియార్ షోస్ కి కూడా, సిద్దమై, ఇలా అర్ధంతరంగా సినిమా విడుదల కాకపోవడం అనేది గతం లో ఎప్పుడు జరగలేదని, సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయం పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
ఇక ఈ అఖండ 2 సినిమా లో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. బాలకృష్ణ కుమార్తె, ఎమ్ తేజస్వి నందమూరి సమర్పణ లో గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు.
Доставка грузов https://avalon-transit.ru из Китая «под ключ» для бизнеса и интернет-магазинов. Авто-, ж/д-, морские и авиа-перевозки, консолидация на складах, проверка товара, страхование, растаможка и доставка до двери. Работаем с любыми партиями — от небольших отправок до контейнеров. Прозрачная стоимость, фотоотчёты, помощь в документах и сопровождение на всех этапах логистики из Китая.