Rajinikanth: రజనీకాంత్‌ది ఎంతో సుధీర్ఘమైన కెరీర్. ఆయన 170 సినిమాల్లో ఎందరో నటీనటులు, సాంకేతిక నిపు ణులతో కలిసి పని చేసి ఉంటారు. కానీ రజనీకాంత్ ఇప్పుడు అప్పటి తన సమాకాలీన మిత్రులలను ఒక్కోక్కొరిగా కలుస్తుండటం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తోంది. రజనీకాంత్ కెరీర్‌లో ‘జైలర్’ సినిమాబ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం రజనీకాంత్ దాదాపు పాతిక సంవత్సరాల తరవాత రమ్య కృష్ణతో కలిసి వర్క్ చేశారు. ‘పడయప్ప’ సినిమా తర్వాత రజనీకాంత్– రమ్యకృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జైలర్ (Jailer)’. ఇదే చిత్రంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్‌లో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు రజీనీకాంత్. ఎలాగూ ‘జైలర్ 2’ ఉంది కాబట్టి మళ్లీ రజనీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌లు సెట్స్‌లో కలుసుకుంటారని ఊహించవచ్చు. అయితే ‘జైలర్’ సినిమాలో బాలకృష్ణతో ఓ రోల్ చేయించాలనుకున్నారు ఈ చిత్రం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. కానీ ఆ సమయంలో కుదర్లేదు. ‘జైలర్ 2’ ఉంది కాబట్టి మరి..ఈ సినిమాలోనైన బాలకృష్ణ రజనీకాంత్‌తో నటిస్తారెమో చూడాలి.అలాగే వేట్టయాన్ సినిమా కోసం రజనీకాంత్ 30 ఏళ్ల తర్వాత అమితాబ్‌బచ్చన్‌తో కలిసి యాక్ట్ చేశారు.
pushpa2 Collections: హిందీలో టాప్ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
ఇక ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ (Coolie)’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ కాంత్, సత్యరాజ్‌లు సిల్వర్‌స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’ సినిమాలో సత్య రాజ్, రజనీకాంత్‌లు చివరిసారిగా కలిసి నటించారు. ఇక ఇప్పుడు ఇదే సినిమా కోసం అమిర్‌ఖాన్‌తో కూడాకలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు రజనీకాంత్. 1995లో వచ్చిన హిందీ చిత్రం ‘అతంక్ హీ అంతక్’ చిత్రం తర్వాత రజనీకాంత్, అమీర్‌ఖాన్(Aamirkhan)లు ‘కూలీ’ సినిమా కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జైపూర్‌లో జరుగుతోంది. రజనీకాంత్–ఆమిర్‌ఖాన్‌లు పాల్గొంటున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మే 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇలా తన వరుస చిత్రాల్లో తన సమకాలీన నటులు, ఇప్పటి ప్రముఖ హీరోలు శివరాజ్‌రాజ్‌కుమార్, మోహన్ లాల్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్‌ఖాన్, సత్యరాజ్‌లతో రజనీకాంత్ స్క్రీన్ షేర్ చేసుకోవడం భలేగా ఆసక్తికరంగా అనిపిస్తోంది కదూ.