దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిషలు కలిసి నటిస్తున్నారు. సూర్య (Suriya), త్రిష (Trisha Krishnan)లు హీరో హీరో యిన్లుగా 2022లో వచ్చిన ‘మౌనం పెసియాధే’ చిత్రంలో తొలిసారి జంటగా నటించారు. ఆ తర్వాతవీరిద్దరు ‘యువ’ (2004) సినిమా కోసం కలిసి పని చేశారు. ఆ మరుసటి ఏడాదే అంటే… 2005లో‘ఆరు’ సినిమా కోసం జోడీగా నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. కానీఆ తర్వాత సూర్య, త్రిషలు ఎందుకో కలిసి నటించలేదు. ఇప్పుడు అంటే…దాదాపు 20 ఏళ్ల తర్వాతసూర్య, త్రిషలు కలిసి నటిస్తున్నారు.
నటుడు–ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలోనే త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ కోయంబత్తూరులో ఈ నెల ప్రారంభంలోనే మొదలైంది. సూర్య, త్రిషల కాంబినేషన్‌లో కోర్టు సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. కానీ సూర్య కెరీర్‌లోని ఈ 45వ సినిమాలో, త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని మాత్రం డిసెంబరు 13న మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఎందుకంటే…శుక్రవారం (డిసెంబరు 13)తో త్రిష ఇండస్ట్రీకి నటిగా వచ్చి, 22 సంవత్సరాలు పూర్తయ్యాయి. 23వ సంవత్సరం మొదలైంది. ఈ సందర్భంగా సూర్య సరసన త్రిష నటిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 ద్వితీయార్థంలో ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్..
ఇక కథ విషయానికి వస్తే… ఓ టెంపుల్ నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుందట. సూర్య, త్రిషలు లాయర్ల పాత్రలో కనిపిస్తారట. కానీ టెంపుల్ మద్దతుదారుల వైపు సూర్య, అపోజిట్ వ్యక్తి వైపు త్రిషలుతమ వాదనలను కోర్టులో వినిపిస్తారట. ఈ దిశగా ఈ సినిమా కథనం సాగుతుందని, కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అయితే కథ విషయంలో అధికారిక సమాచారం అందాల్సి ఉంది.