తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) కొత్త సినిమా (Chiyaan63) ఆరంభమైంది. తమిళంలో శివకార్తీకేయన్ ‘మావీరన్ (తెలుగులో ‘మహావీరుడు’), యోగిబాబుతో ‘మండేలా’ (తెలుగులో ఈ సినిమా ‘మార్టిన్ లూథర్‌కింగ్’గా రీమేక్ కాగా,ఇందులో సంపూర్ణేష్‌బాబు హీరోగా చేశారు) వంటి సినిమాలను చేసిన మండోనా అశ్విన్ దర్శకత్వంలోవిక్రమ్ హీరోగా నటిస్తారు. విక్రమ్ కెరీర్‌లోని ఈ 63వ సినిమాను, శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వనిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. సినిమాను కూడా వచ్చేఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులవివరాలను త్వలరోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.