దర్శకుడు వెంకీ అట్లూరి (Director venkey atluri)తో ఓ స్పెషల్. ఇతని గత రెండు సినిమాలు పరభాష హీరోలైన ధనుష్ (సార్ సినిమా), దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)లో రూపొందాయి. కానీ ఆశ్చర్యకరంగా వెంకీ అట్లూరి నెక్ట్స్‌మూవీ కూడా పరభాష హీరో సూర్యతో రానుందని, కోలీవుడ్ సమచారం. ఇటీవల వెంకీ అట్లూరి ఓకథను సూర్యకు వినిపించారని, సూర్య ప్రాథమికంగా కథ అంగీకారం తెలిపారని సమాచారం. వెంకీఅట్లూరి గత రెండు సినిమాలను నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థే …..వెంకీఅట్లూరి–సూర్యసినిమాను నిర్మించనుందట.
Suriya45: మైథలాజికల్ మూవీతో సూర్య
మరోవైపు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో హీరో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఓ సినిమా చేయను న్నారనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. మరోవైపు సూర్య ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా సూర్య హీరోగా కార్తీక్‌సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.