Ajith Vidaamuyarchi: ఓ స్టార్ హీరో సినిమా, ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్…ఇలా ప్రమోషనల్ కంటెంట్ ఏదైనా సరే ఓ రేంజ్‌లో హడావిడి ఉంటుంది. అజిత్ ‘విడాముయర్చి’ (Vidaamuyarchi) సినిమా ఫస్ట్‌లుక్ అప్పుడు కూడ ఇదే హంగామా నడిచింది. సోషల్‌మీడియా మొత్తం తెగ హడావిడి చేశారు అజిత్ ఫ్యాన్స్. కానీ ఈ సినిమా టీజర్‌ను మాత్రంచాలా సింపుల్‌గా రాత్రి 11 గంటల సమయంలో రిలీజ్ చేశారు. ఏ మాత్రం హడావిడి లేదు. మరి..ఇంత సైలెంట్‌గి రిలీజ్ చేయడానికి కారణాలు ఏంటో తెలియదు.
అజిత్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. అజిత్ కెరీర్‌లో 25వ సినిమాగా రిలీజ్ కాబడిన ‘మంగాత’ (తెలుగులో ‘గ్యాంబ్లర్’) తర్వాత అజిత్, అర్జున్, త్రిషలు కలిసి నటిస్తున్న మూవీ ఇది. మగిళ్ తిరుమేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ
సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో రిలీజ్ కానుంది. ఓ ఫారిన్ కంట్రీకి విహారయాత్రకు వెళ్తుందిహీరో ఫ్యామిలీ. అక్కడ హీరో భార్య, కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేస్తారు. తన ఫ్యామిలీని హీరో ఎలాకాపాడుకున్నాడు? అన్నదే కథనం. ‘విడాముయర్చి’ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకు తమిళ రీమేక్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే రిలీజైన ‘విడాముయర్చి’ ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం విశేషం.
మైత్రీమూవీమేకర్స్‌తో అజిత్ ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’ సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సడన్‌గా ‘విడాముయర్చి’ సినిమా సంక్రాంతి క్యూ రిలీజ్‌కు వచ్చి పడింది. ఇక అజిత్ తర్వాతి సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.