మూడు సంవత్సరాలుగా ఓ మంచి హిట్ కోసం హీరో ఆదిసాయికుమార్ కష్టపడుతూనే ఉన్నాడు కానీ…హిట్ మాత్రం దొరకడం లేదు. ఎప్పటికప్పుడు జానర్స్ మారుస్తూనే ఉన్నా, ఫలితం మాత్రం లేదు. దీంతో…ప్రజెంట్ ‘శంబాల’ (Shambhala movie Teaser) అనే ఓ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు ఆదిసాయికుమార్. ఈ మూవీలో ఆది సాయికుమార్ ఓ జియో సైంటిస్ట్‌గా కనిపిస్తాడట. ఈ సినిమా మూడు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో సాగుతుంది.
లేటెస్ట్‌గా ఈ శంబాల సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ సాగుతుంది. డైలాగ్స్, విజువల్స్ అయితే ఆసక్తికరంగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మాత్రం ఎంగేజ్ చేస్తుందనేది చూడాలి. యుగంధర్ ముని డైరెక్షన్‌లో, అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. త్వరలోనే రిలీజ్‌డేట్‌ను ప్రకటిస్తారు మేకర్స్.
‘‘ఈ విశ్వంలో అంతుపట్టని రహాస్యాలు ఎన్నో ఉన్నాయి. వీటికి సైన్స్‌కి సమాధానం దొరక నప్పుడు మూఢనమ్మకం అంటుంది. అదే సమాధానందొరికితే అదే తన గొప్పదనం అంటుంది. ‘పంచభూతాలను శాసిస్తోందంటే ఇది సాధారణమైనది కాదు..దీని ప్రభావం వల్ల మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో ఊహించలేం’’ అన్న ఆసక్తికరమైన డైలాగ్స్ ‘శంబాల’ మూవీ టీజర్ (Shambhala movie Teaser)లో ఉన్నాయి.