అరవై సంవత్సరాల వయసులో కూడా ఓ మహిళతో తాను డేటింగ్ చేస్తున్నానంటూ బాలీవుడ్ టాప్ స్టార్ ఆమిర్‌ఖాన్ వెల్లడించడం, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది (Aamirkhan Confirms Relationship). ఇంతకీ..విషయం ఏంటం టే…ఈ రోజు (మార్చి 14) ఆమిర్ ఖాన్ బర్త్ డే. ఈ సందర్భంగా నిన్న రాత్రి…ముంబై సినీ ఇండస్ట్రీ వాసులకు గ్రాండ్ బర్త్ డే పార్టీ ఇచ్చారు ఆమిర్ ఖాన్. ఈ పార్టీలో ఆమిర్‌ఖాన్ తన కొత్త లైఫ్ పార్ట్‌నర్ అంటూ గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) అనే అమ్మాయిని మీడియా ప్రతినిధులకు పరిచయం చేశాడు. దీంతో అక్కడి వారం దరూ అవాక్కయ్యారు.
ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నా: ఆమిర్‌ఖాన్ (Aamirkhan Confirms Relationship: )
‘‘గౌరీ నాకు పాతిక సంవత్సరాలుగా తెలుసు. గత ఏడాది నుంచి ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మా రిలేషన్‌షిప్‌ను మా ఇద్దరి కుటుంబాల సభ్యులు కూడా అంగీకరించారు. మేం హ్యాపీగా ఉన్నాం’’ అంటూ ఆమీర్‌ఖాన్ మాట్లాడారు. ఈ వేడుకలో తన కొత్త జీవితభాగస్వామిని తన తోటి టాప్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లకు పరిచయం చేశాడు ఆమిర్‌ఖాన్. అలాగే గౌరీ ఫోటోలను తీయవద్దని అక్కడి ఫోటో గ్రాఫర్స్ ను ఆమిర్‌ఖాన్ రిక్వెస్ట్ చేయడం కొసమెరుపు.
నాని నిర్మాణంలోని ప్రియదర్శి కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ రివ్యూ
ఎవరు ఈ గౌరి?
గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం ఆమిర్‌ఖాన్ నిర్మాణసంస్థ ‘ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్’ సంస్థలో వర్క్ చేస్తోంది. ఆమెకు ఇదివరకే వివాహం జరిగింది. ఆరు సంవత్సరాల వయసు ఉన్నా బాబు కూడా ఉన్నాడు. ఇది వరకు ఓ ఐరీష్ దేశ వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత ఆ వ్యక్తితో గౌరీ విడిపోయారని బాలీవుడ్‌లో ప్రాచారం సాగుతోంది. ఒక గౌరీ మూలాలు మాత్రం దక్షిణాదిలోనే ఉన్నాయి. ఆమె ఒక తమిళ యువతి అని, బెంగళూరులో నివాసం ఉంటారని బాలీవుడ్ టాక్.
మరోవైపు ఆమిర్‌ఖాన్‌కు ఆల్రెడీ రెండు పెళ్లిల్లు జరిగాయి. తొలిసారి రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు ఆమిర్. ఆ తర్వాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. 2002లో రీనాతో, 2021లో కిరణ్‌రావుతో విడాకులు తీసుకున్నారు ఆమిర్‌ఖాన్. ఇప్పుడు…గౌరీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఆమిర్ తెలిపారు.
కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీ రివ్యూ
ఆమిర్‌ఖాన్ కొత్త సినిమాలు
ఆమిర్‌ఖాన్ కొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’. ఆమిర్ హిట్ మూవీ ‘తారే జమీన్ పర్’ సినిమాకు ఇది సీక్వె ల్. జెనీలియా హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీని జూన్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా ఆమిర్‌ఖాన్ పేర్కొ న్నారు. ఇంకా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని, ఈ మూవీని తీసేందుకు వర్క్ మొదలైయ్యాయని కూడా ఆమీర్‌ఖాన్ తెలిపారు.