అడవి శేష్ టాలీవుడ్‌లో మంచి ప్రామిసింగ్ హీరో. అయితే ఈ హీరో నుంచి సినిమా వచ్చి, మూడు సంవత్సరాలు అయిపోతుంది. 2022లో ‘మేజర్, హిట్ 2’ సినిమాల హిట్స్‌తో ఆడియన్స్‌ను అలరించాడు అడవి శేష్. కానీ ఆ తర్వాత ఈ హీరో నుంచి మరో మూవీ అయితే ఇప్పటివరకు థియేటర్స్‌లోకి రాలేదు. కానీ రెండు సంవత్సరాలుగా శేష్ ‘డకాయిట్ (Adivi Sesh Dacoit Release ), గూఢచారి 2 (G2 Release)’ సినిమాలపై వర్క్ చేస్తున్నాడు. కానీ ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరిస్థితి. ఓ సందర్భంగా ‘డకాయిట్, గూఢచారి 2’ సినిమాలు ఈ ఏడాదే విడుదల అవుతాయని, శేష్ చెప్పాడు. కానీ..ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. గూఢచారి 2 సినిమా ఈ ఏడాది విడుదల కావడం లేదు.
Adivi Sesh Dacoit: డకాయిట్ రిలీజ్ డేట్
అయితే..‘డకాయిట్’ చిత్రం మాత్రం ఈ ఏడాదే విడుదల అవుతుంది. ఈ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాకూర్ (Adivi Sesh Dacoit Heroine Mrunal Tagore) హీరోయిన్‌గా చేస్తున్నారు. అడివి శేష్ ‘క్షణం’సినిమాకు కెమెరామెన్‌గా వర్క్ చేసిన షానియల్ డియో ఈ సినిమాకు దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ–నిర్మాతగాఈ సినిమా నిర్మించబడుతుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు ఆర్‌ఆర్ అందిస్తున్నారు. లేటెస్ట్‌గా ‘డకాయిట్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న (Adivi Sesh Dacoit Release date) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇందుకోసం ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది.
Adivi Sesh Dacoit: డకాయిట్ స్టోరీ
ఇద్దరు మాజీ ప్రేమికుల నేపథ్యంతో డకాయిట్ సినిమా కథనం సాగుతుంది. ప్రేమించుకుని, బ్రేకప్ చెప్పుకున్న తర్వాత, వీరిద్దరి ఓ క్రైమ్ కోసం మళ్లీ కలుస్తారు. అప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథనంగా తెలుస్తోంది. ‘డకాయిట్’ సినిమాకు హీరోయిన్‌గా తొలుత శ్రుతీహాసన్‌ను తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల శ్రుతీహాసన్ తప్పుకోవడంతో, మృణాల్ ఠాకూర్ ఫైనలైజ్ అయ్యారు.
ఇక ‘గూఢచారి 2’ సినిమా విడుదల వచ్చే ఏడాదే అని తెలుస్తోంది. ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…‘గూఢచారి 2’ సినిమాకు విజయ్ అనే కొత్త దర్శకుడు వర్క్ చేస్తుంటే, ‘డకాయిట్’ సినిమా కూడా వర్క్ చేస్తున్నది కొత్త దర్శకుడే కావడం మరో విశేషం.