please subscribe to Tollywoodhub YouTube channel

డెకాయిట్‌…డాక్టర్‌ కాదు..దొంగ!

Viswa

Web Stories

Adivisesh Dacoit teaser: అడివి శేష్‌ నుంచి ఓ సినిమా థియేటర్స్‌కి వచ్చి, మూడు సంవత్సరాలకుపైనే అవుతుంది. శేష్‌ ప్రజెంట్‌ ‘డెకాయిట్, జీ2 (గూఢచారి 2)’ అనే సినిమాలు చేస్తున్నాడు. 2025 లోనే ఈ సినిమాలు విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రెండూ సినిమాలూ వచ్చే ఏడాదే విడుదల కానున్నాయి. లేటెస్ట్‌గా ‘డెకాయిట్‌’ సినిమా టీజర్‌ (Adivisesh Dacoit teaser) ను రిలీజ్‌ చేశారు. రాయలసీమ యాసలో అడివిశేష్‌ మాట్లాడుతున్నాడు. నాగార్జున ‘హలో బ్రదర్‌’ సినిమాలోని కన్నుకొట్టరో…పాట వినిపిస్తుంది బ్యాగ్రౌండ్‌లో…

అడివి శేష్‌ హీరోగా నటించిన ‘క్షణం’ సినిమాకు డీవోపీగా పనిచేసిన షానీల్‌ డియో (Adivisesh Dacoit Movie Director Shaneil Deo) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా స్టోరీని, షానీల్‌తో పాటుగా, అడివి శేష్‌ కలిసి రాశాడు. ఇంకా ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనురాగ్‌ కశ్యప్, ప్రకాష్‌రాజ్, అతుల్‌ కులకర్ణి, సునీల్, కామాక్షీ భాస్కర్ల ఇతర కీలక పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు (Dacoit Cast and Crew). పోలీస్‌ ఆఫీసర్‌ స్వామిగా అనురాగ్‌కశ్యప్‌ ఈ సినిమాలో కనిపిస్తారు. అనురాగ్‌ కశ్యప్‌కు, తెలుగులో తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇంకా ఈ ‘డెకాయిట్‌’ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే తెలుగు టీజర్‌ను హైదరాబాద్‌లో, హిందీ టీజర్‌ను ముంబైలో మేకర్స్‌ లాంచ్‌ చేశారు .అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏషియన్ సునీల్‌ నారంగ్‌ కూడ ఈ సినిమా నిర్మాణంలో భాగమైనట్లుగా తెలుస్తుంది (Adivisesh Dacoit teaser).

(Dacoit Movie Story) ఓ ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ నేపథ్యంతో ‘డెకాయిట్‌’ సినిమా కథ సాగుతుంది. ఇద్దరు దొంగలు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ చెప్పుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, బ్రేకప్‌ చెప్పుకున్న ఆ ఇద్దరు ప్రేమికులు కలిసి ఓ క్రైమ్‌ చేయాల్సి వస్తుంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంతో వీరిద్దరు మళ్లీ ఎలా కలుస్తారు? అన్నదే ఈ సినిమా ‘డెకాయిట్‌’ స్టోరీ అనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తొలుత ఈ సినిమాకు శ్రుతీహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొంత షూటింగ్‌ కూడ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల శ్రుతీహాసన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో, ఈ ప్లేస్‌లోకి మృణాల్‌ఠాకూర్‌ వచ్చారు.

ఇక డెకాయిట్‌ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో మార్చి 19న రిలీజ్‌ చేస్తున్నట్లుగా ప్రకటిం చారు. కానీ ఇదే సమయానికి హిందీలో రణ్‌బీర్‌కపూర్‌ ‘లవ్‌ అండ్‌ వార్‌’, ‘కేజీఎఫ్‌’ యశ్‌ టాక్సిక్, రణ్‌వీర్‌సింగ్‌ ‘ధురంధర్‌ 2’ చిత్రాలూ కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేప థ్యంలో ‘డెకాయిట్‌’ సినిమా మార్చి 19నే రిలీజ్‌ అవుతుందా? అనేది చూడాలి.

Please Share
7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi