please subscribe to Tollywoodhub YouTube channel

‘పిఠాపురంలో…’…సినిమా సక్సెస్ కావాలి: దర్శకుడు కొరటాల శివ

Viswa
1 Min Read

Web Stories

Pithapuram Lo Movie: రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్‌ శంకర్, మణిచందన ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పిఠాపురంలో…’. ‘అలా మొదలైంది’ అనేది క్యాప్షన్‌. సీనియర్‌ దర్శకుడు మహేష్‌ చంద్ర దర్శకుడు. మహేశ్‌చంద్ర సినిమా టీమ్‌ బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్, ఎఫ్‌.ఎమ్‌ మురళి నిర్మించారు. ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలోని ‘పట్టుకో బాబా..’ పాట లిరికల్‌ వీడియోను, దర్శక–నిర్మాత కొరటాల శివ రిలీజ్‌ చేసి, యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

అనంతరం దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ–‘‘చంద్రమహేశ్‌గారి ‘ప్రేయసి రావే’ చిత్రానికి నేను రైటింగ్‌ అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాను. ఆ తర్వా త ఆయన డైరెక్షన్‌లో వచ్చిన మరికొన్ని సినిమాలకూ వర్క్‌ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లోని తాజా సినిమాలోని పాటను నేను లాంచ్‌ చేయడం సంతోషంగా ఉంది. నేటి యువతరం ప్రేమ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, తల్లిదండ్రులతో వాళ్లకున్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ని చర్చిస్తూ, కొత్త తరహా విధానంలో ఈ సినిమా చాలా మంచి విషయం. ఎందుకంటే…ఈ తరహా సినిమాలు ఇప్పుడు అవసరం. ‘ప్రేయసి రావే’ చిత్రంలోని ఫీల్‌తో ‘పిఠాపురంలో..’ సినిమా కూడా ఉంటుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు కొరటాల శివ.

చంద్రమహేశ్‌ మాట్లాడుతూ–‘‘ఇటీవల విడుదలైన మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అన్ని ఏరియాల పంపిణీదారులు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా ఫస్ట్‌ కాపీతో సహా సిద్ధమైంది’’ అని చెప్పారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi