అజిత్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Ajith GoodBadUgly). ‘మార్క్ ఆంటోని’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత అజిత్‌తో తమిళ యు వ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. తెలుగు నిర్మాణసంస్థ మైత్రీమూవీమేకర్స్ ఈ సిని మాను నిర్మించింది.
ఈ ‘గుడ్‌బ్యాడ్ అగ్లీ’ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అజిత్ స్టైలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. అజిత్ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. త్రిష ఈ మూవీలో హీరోయిన్. అర్జున్‌దాస్ ఓ విలన్‌గా చేస్తున్నాడు. కానీ మెయిన్ విలన్ కాదు.
నేనేరా..నీకు విలన్..!
ఏకే వస్తున్నాడు..దారి వొదలండ్రా..!
వాడు…భయాన్నే భయపెట్టేవాడు..!
ఈ డైలాగ్స్ ‘గుడ్‌బ్యాడ్ అగ్లీ’ సినిమా (Ajith GoodBadUgly) తెలుగు ట్రైలర్‌లో ఉన్నాయి.
సునీల్, ప్రసన్న, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, రాహుల్ దేవ్, యోగిబాబు..సినిమాలోని ఇతర పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్‌కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.
అజిత్ గత చిత్రం ‘విడాముయర్చి’ (తెలుగులో ‘పట్టుదల’) తెలుగు ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరి చింది. దీంతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా అయినా..సక్సెస్ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు అయితే అజిత్ నెక్ట్స్ మూవీ ఇంకా ఫిక్స్ కాలేదు.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను తొలుత 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ విడాముయర్చి రిలీజ్ కారణంగా ఏప్రిల్ 10కి రిలీజ్‌ను వాయిదా వేశారు.