తమిళ స్టార్ హీరో అజిత్ (AjithKumar)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సినిమాలు కాకుండ రైఫిల్ షూటింగ్, రేసింగ్‌ల పట్ల హీరో అజిత్ ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. వీలైనప్పుడు పోటీల్లో పాల్గొంటుంటారు. కొన్నిసార్లు విజేతగా కూడా నిలిచారు.
అలా ఈ సారి జనవరి 11, 12 తేదీల్లో దుబాయ్‌లో ‘24హెచ్ దుబాయ్ 2025’ పేరిట ఓ కార్ రేసింగ్ జరగనుంది. ఈ రేసింగ్‌లో పాల్గొనేందుకు అజిత్ రెండుమూడు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే మగళవారం అజిత్ ప్రాక్టీస్ చేసే సమయంలో అతని, కారు అదుపు తప్పింది. దీంతో చాలా స్వల్ప గాయాలతో అజిత్ బయటపడ్డారు. గాయాలేమీ కాకపోవడంతో, ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనాలనే అజిత్ ఆసక్తి చూపిస్తున్నారట.
ఇక సినిమాల విషయానికి వస్తే…అజిత్ హీరోగా ‘విడాముయర్చి’, ‘గుడ్‌బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ‘విడాముయర్చి’ మూవీ జనవరి 23న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని కోలీవుడ్ సమాచారం.