అఖిల్ ఎప్పట్నుంచో ఓ బ్లాక్‌బస్టర్ కోసం వెయిటింగ్. ‘హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచి లర్’…ఇలా క్లాస్ చిత్రాలతో ట్రై చేసినా, ఇవి అబౌవ్ యావరేజ్‌గానే మిగిలిపోయాయి. ‘ఏజెంట్’లాంటి మాస్ చిత్రాన్ని ట్రై చేస్తే, ఆడియన్స్ డిజాస్టర్ చేశారు. అందుకే..ఈ సారి..క్లాస్ అండ్ మాస్‌ను మిక్స్ చేసి లెనిన్ (Akkineni Akhil Lenin) మూవీ చేస్తున్నాడు అఖిల్.
‘లెనిన్’ మూవీ కోసం వేషం, భాష, బ్యాక్‌డ్రాప్ అన్నీ మార్చాడు. ‘లెనిన్’ మూవీ కోసం అఖిల్ కొత్తగా మేకోవర్ అయ్యాడు. లేటెస్ట్‌గా లెనిన్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడంలో అఖిల్ ఫర్వాలేదనిపించాడు. ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ మూవీలో శ్రీలీల హీరోయిన్. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (Lenin Movie Director) ఈ లెనిన్ మూవీకి దర్శకుడు.
ఈ రూరల్ రస్టిక్ లవ్‌స్టోరీ మూవీ ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మూప్ఫై శాతానికి పైగా పూర్తయింది. వీలైతే ఈ ఏడాదే రిలీజ్ చేయాలని, ‘లెనిన్’ నిర్మాతలు..అక్కినేని నాగార్జున, నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. దసరాకు అనుకుంటున్నారు..కానీ ఆల్రెడీ దసరా రిలీజ్ లిస్ట్ (సాయిధరమ్‌తేజ్ ‘సంబరాల ఏటిగట్టు, బాలకృష్ణ అఖండ 2, కాంతార 2) సినిమాలో ప్యాక్డ్‌గా ఉంది. సో..ఈ ఏడాది చివర్లో లెనిన్ (Lenin Movie Release) మూవీ రిలీజ్ ఉండొచ్చు.