12A Railway Colony Review: కథ
వరంగల్‌లోని రైల్వే కాలనీలో నివాసం ఉండే కార్తీక్ (అల్లరి నరేశ్) అనాథ. ఎమ్‌ఎల్‌ఏ కావా లనుకుంటన్న టిల్లు (జీవన్) గ్యాంగ్‌లో కీలక సభ్యుడు. తన ఇంటి పక్కనే, 12ఏ ఇంట్లో నివా సం ఉంటున్న ఆరాధన (కామాక్షీ భాస్కర్ల)ను ఇష్టపడతాడు. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నది ఆరాధన లక్ష్యం. ఇక ఎలక్షన్ పనుల్లో భాగంగా యూత్ ను మేనేజ్ చేయమని, యూత్‌కు ఆటల పోటీలు పెట్టమని, ఇందుకు తన తమ్ముడు మున్నా సహాయం తీసుకోమని కార్తీక్‌కు టిల్లు చెబుతాడు. ఈ పనుల్లో కార్తీక్ బిజీగా ఉంటాడు. కానీ సడన్‌గా మున్నా హత్య చేయబడతాడు. మున్నాను ఎవరు హత్య చేశారు? అన్న సస్పెన్స్ కొనసాగుతుండగానే, మరోవైపు ఆరాధన, ఆమె తల్లి కూడా హత్య చేయబడతారు. మరి…. మున్నా, ఆరాధనల హత్యల వెనక ఉన్నది ఎవరు? నిజమైన హంతకుడిని కార్తీక్ ఎలా కని పెట్టాడు? ఈ కేసులో పోలీస్ ఆఫీసర్ రాణా ప్రతాప్ (సాయికుమార్)కు తెలిసిన నిజాలు ఏమిటి? ఆరాధన హత్య కేసులో డాక్టర్ జయదేవ్ షిండే (అవినాష్ కురివిల్లా) ప్రమేయం ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ
ఈ 12ఏ రైల్వే కాలనీ సినిమాకు ‘పోలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్…కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. ఆయన గత చిత్రాల మాదిరిగానే, ఈ సినిమాలోనూ మూఢనమ్మకాల ప్రస్తావనకు, మర్డర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు లింక్ చేశాడు. తొలిభాగం అంతా కూడా కార్తీక్ లవ్‌స్టోరీ, టిల్లు ఎలక్షన్ హడావిడి, హీరో ఇంట్రో, లవ్ సాంగ్‌తో నడుస్తుంది. ప్రీ ఇంట్రెవెల్‌కి కానీ అసలు కథ ప్రారంభం కాదు. ఇంట్రవెల్‌లో ఓ చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఇక సెకండాఫ్ అంతా మర్డర్ ఇన్వెస్టి గేషన్ డ్రామాతో కొనసాగుతుంది. మున్నాను ఎవరు హత్య చేశారు? అన్న విషయంలో పెద్దగా సస్పెన్స్ లేనప్పటికీని, ఆరాధన హత్య చేసిన క్యారెక్టర్ కాస్త థ్రిల్‌కు గురి చేయవచ్చు. రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు చూసేవారికి మాత్రం పెద్ద కిక్ ఉండదు.
ఈ సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని ‘12ఏ రైల్వే కాలనీ’ టీమ్ చెప్పుకున్న, స్క్రీన్ ప్లే విషయంలో అనిల్ విశ్వనాథ్ స్ట్రాటజీ పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఊహాత్మక సన్ని వేశా లు, సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. తొలిభాగంలో ఇవే ఎక్కువ. ముఖ్యంగా హీరో తన ఫ్రెం డ్స్‌తో వేసే బాతాకానీ ముచ్చట్లు. సెకండాఫ్‌లో వచ్చే ఇన్వెస్టిగేషన్ డ్రామా కూడా పెద్దగా ఆసక్తికరంగా ఉండదు. క్లైమాక్స్ కూడ కొత్తగా ఏం అనిపించదు.
ఆరాధనను మర్డర్ చేయాలనుకుని వచ్చిన వ్యక్తి, లొకేషన్‌లో మర్డర్ వెపన్‌ను వదిలి వెళ్లడం అనేది దర్శకుడి రచన విధానంలో ఉన్న డొల్ల తనాన్ని చూపిస్తుంది. ఒకవైపు మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా, నిజంగా మర్డర్ చేసిన వ్యక్తి ఏం కాదులే అన్నట్లు హ్యాపీగా ఇంట్లోనే ఉండటం ఏంటో దర్శకుడికే తెలియాలి. వరంగల్‌లో హత్య జరిగితే, హైదరాబాద్ పోలీసులు వచ్చి ఇన్వెస్టి గేషన్ ఎందుకు చేస్తున్నారో, సరైన కారణం ఎస్టాబ్లిష్ కాలేదు. ఇలాంటి లోటుపాట్లు మరికొన్ని ఉన్నాయి.
నటీనటులు– సాంకేతిక నిపుణులు
తనకు కొత్త జానర్ అయిన సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లింగ్ డ్రామాలో అల్లరి నరేశ్ తన వంతు యాక్టింగ్ చేశాడు. యాక్టర్‌గా కార్తీక్ పాత్రకు న్యాయం చేశాడు. అంతే. కామాక్షీ భాస్కర్ల ఉన్న ంతలో మెప్పించారు. ముంబై డాక్టర్ అవినాష్ కురివిల్లాకు షిండేగా మంచి ఇంపార్టెన్స్ రోల్ దక్కింది. వైవా హర్ష, గెటప్ శీను, సిద్దాం..లు హీరో ఫ్రెండ్స్‌గా కనిపించారు. అభిరామి ఓ సర్‌ప్రైజింగ్ రోల్ చేశారు. రాజకీయ నేత టిల్లుగా జీవన్ కాస్త సీరియస్ రోల్‌లో కనిపించాడు.
అనిల్ విశ్వనాథ్, నాని కాసరగడ్డలు కూడా గెస్ట్ రోల్స్ చేశారు.
దర్శకుడు నాని కాసరగడ్డ డైరెక్షన్ ఒకే. అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లేలో మరింత గ్రిప్పింగ్‌నెస్ ఉండి ఉండాల్సింది. నిర్మాణ విలువలు, కెమెరా వర్క్ ఫర్వాలేదు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ బాగుంది. కానీ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా అయితే లేదు. ఆర్‌ఆర్ ఒకే. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు.
ఫైనల్‌గా….: పారానార్మల్ టింజ్ ఉన్న ‘12ఏ రైల్వేకాలనీ’లో సరైన సస్పెన్స్, థ్రిల్లింగ్ మూ మెంట్స్ లేవు. ఇన్వెస్టిగేషన్ డ్రామా కూడా కొత్త తరహాలో లేదు. క్రైమ్ కథలు ఇష్టపడేవారు ఓ సారి ‘12ఏ రైల్వేకాలనీ’లోకి వెళ్లి రావొచ్చు. కానీ ఎగై్జట్ అవుతారని మాత్రం గ్యారెంటీగా చెప్పలేం.