అల్లు అర్జున్ (AlluArjun), బోయపాటి శీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా మాస్ బ్లాక్‌బస్టర్. 2016లో ఈ చిత్రం విడుదలైంది. ఈ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో మరో సినిమా చేయాలని (Sarrainodu2) అల్లు అర్జున్ అనుకున్నాడు. కానీ ‘పుష్ప’ ఫ్రాంచైజీకి, అల్లు అర్జున్ ఐదేళ్లు కేటా యించడం, ఈ ‘పుష్ప’ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్ కావడంతో, బోయపాటితో అల్లు అర్జున్ చేయా లనుకుంటున్న సినిమా వాయిదా పడుతూ వస్తోంది.
అయితే ‘పుష్ప 2’ సినిమా సమయంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బోయపాటి శీను అడ్వాన్స్ తీసుకున్నారు. దీంతో ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ, బోయపాటి శీనుతోనని, సరైనోడు సీక్వెల్ (Sarrainodu2) తీస్తారనే ప్రచారం బాగా జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం బోయపాటి శీనుతో సినిమా చేయకుండ, అట్లీ సినిమాకు కమిటైయ్యాడు. దీంతో బాలకృష్ణతో అఖండ 2 సినిమాను స్టార్ట్ చేశాడు బోయపాటి శీను. అయితే అట్లీ మూవీ తర్వాత అల్లు అర్జున్ సినిమా బోయపాటితోనే ఉంటుందనే ప్రచారం ఇప్పుడు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ‘అఖండ 2’ సక్సెస్, అట్లీతో అల్లు అర్జున్ చేసే సినిమా సక్సెస్‌లపై ‘సరైనోడు 2’ సినిమా భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది. అఖండ 2 సక్సెస్ అయితే బోయపాటితో అల్లు అర్జున్ సినిమా చేయవచ్చు. మరోవైపు అట్లీతో అల్లు అర్జున్ చేసే సినిమా పెద్ద స్థాయిలో కనుక హిట్ అయితే…అల్లు అర్జున్ మరో పాన్ ఇండియన్ డైరెక్టర్‌తో ముందుకు వెళ్లొచ్చు. మరి. .సరైనోడో 2 ఎప్పుడు సెట్స్‌కు వెళ్తుంది? అసలు…ఈ సినిమా ఉంటుందా? అనేది చూడాలి.