Mahabharatham Movie: హిందీలో గ్రాండ్ స్కేల్‌లో ‘రామాయణ’ సినిమాను తీస్తున్నారు నిర్మాత నమిత్‌మల్హోత్రా. రెండు పార్టులగా రానున్న ఈ సినిమా తొలిపార్టు వచ్చే దీపావళికి, సెకండ్‌పార్టు ఆపై వచ్చే దీపావళికి రిలీజ్ కానుంది. దాదాపు రూ. 4000 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మిస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పారు. యశ్ ఈ సినిమాకు మరో నిర్మాత.
కానీ ‘రామాయణ’ (Ramayana Movie) సినిమా ఐదారు సంవత్సరాల క్రితం మొదలైనప్పుడు, ఈ సినిమాను నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు నిర్మించాలనుకున్నారు. దర్శకుడు రవి ఉడయార్, నితీష్ తివారి అప్పట్లో హిందీ ‘రామాయణ’ సినిమాపై స్క్రిప్ట్‌ంగ్ పనులు ప్రారంభించారు. మధ్యలో అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు ఉన్నాయి. రవి ఉడయార్ ఈ సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పు కున్నాడు. అలాగే అల్లు అరవింద్, మధు మంతెనలు సైతం ఈ ‘రామాయణ’ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. కొంతకాలం తర్వాత అల్లు అరవింద్, మధు మంతెనలు కలిసి ‘మహాభారతం’ ఆధారంగా వెబ్‌సిరీస్ తీయనున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఇప్పుడు ‘మహాభారతం’ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు గీతా ఆర్ట్స్‌లో గోప్యంగా ఎప్పట్నుంచో జరుగుతున్నాయని, ఓ సారి బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయితే, ఈ సినిమాపై మరిన్ని వివరాలు బయటకు వస్తాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అంతేకాదు.. మహా భారతంలోని అర్జునుడి పాత్ర హైలైట్ అయ్యేలా, ఈ ‘మహాభారతం’ సినిమా ఉంటుం దని, ఈ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మరి..ఈ సినిమాకు ఎవరు దర్శ కత్వం వహిస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.