ప్రముఖ నటుడు దివంగత అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఇటీవల మరణించారు. ఆమె దశ దిన కర్మ వేడుకులను ఘనంగా నిర్వహించారు అల్లు అరవింద్. తన తల్లి అల్లు కనకరత్నం సంపూ ర్ణ, సంతోషకరమైన జీవితం గడిపారని, అందుకే ఆమె మరణాన్ని ఓ వేడుకలా సెలబ్రేట్ చేయాలనుకున్నామని ఆయన తెలిపారు. తల్లి మరణించిన రోజున కుటుంబమంతా ఎంతో భావోద్వేగానికి లోనైయ్యామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్‌లతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్ నాన్నమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం పెద్ద కర్మ ఫోటోలు

Leave a Comment