‘పుష్ప 2’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత అల్లు అర్జున్– త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని నాలుగో మూవీ (AlluArjun Movie with Trivikram) (గతంలో జులాయి, సన్ఫాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో..’ అన్న హిట్ సినిమాలొచ్చాయి) సెట్స్‌పైకి వెళ్లాల్సింది. 2023 జూలై 23న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ సుకుమార్ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్ కమిటైన ‘పుష్ప’ చిత్రం అనూహ్యంగా, రెండు పార్టులు కావడంతో, త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ బాగా ఆలస్యమైపోయింది.
అయితే పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ చేయాలనుకున్నారు అల్లుఅర్జున్. కానీ ‘పుష్ప 2’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌పైగా సాధించినట్లు మేకర్స్ చెప్పుకున్నారు. దీంతో అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన మూవీపై అంచనాలు ఉంటాయి.
కానీ త్రివిక్రమ్ ఇప్పటివరకు పాన్ ఇండియా ఫిల్మ్ చేయలేదు. పైగా ఈ మూవీని అల్లుఅర్జున్ బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’, సూర్యదేవరరాధాకృష్ణల హారికహాసిని క్రియేషన్స్‌లు కలిసి నిర్మించాల్సింది. కానీ ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ పారితోషికం పెంచేశారట. దీంతో హారికహాసిని వాళ్లకు కాస్త భారమై ఉండొచ్చు.
వీటన్నింటికి తోడు పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్ చాలా క్లోజ్‌గా ఉంటారు. కానీ మెగాఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య ఇప్పుడు టర్మ్స్ ఏ మాత్రం బాగాలేవు. దీంతో అల్లు అర్జున్‌తో మూవీ చేయడానికి ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా సుముఖంగా ఉండి ఉండకపోవచ్చు. ఇలా ..లేటెస్ట్‌గా అల్లు అర్జున్– త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని మూవీ తాత్కాలికంగా వాయిదా పడటానికి చాలా కారణాలు ఉన్నాయి.
అందుకే తన మార్కెట్ స్థాయిని ఏ మాత్రం తగ్గించుకోకూడదని, హిందీలో షారుక్‌ఖాన్‌తో ‘జవాను’ తీసి వెయ్యికోట్లు కలెక్షన్స్ తెచ్చిన తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ కమిట్ అయిన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి అట్లీతో అల్లు అర్జున్ ముందే చేయాల్సింది. కానీ ఈ మూవీ నిర్మాణంలో సన్‌పిక్చర్స్‌తో పాటుగా, గీతా ఆర్ట్స్ కూడా భాగమవ్వాలని అల్లు అర్జున్ కండీషన్ పెట్టారట. కానీ ఇది అట్లీ టీమ్ నచ్చలేదు. దీంతో అప్పట్లో అల్లు అర్జున్– అట్లీ కాంబినేషన్ ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు త్రివిక్రమ్‌తో తన సినిమాను అల్లు అర్జున్ ఎలాగూ వాయిదా వేయాలనుకుంటున్నారు కాబట్టి..ఆల్మోస్ట్ మరో ఇమ్మిడియేట్ ఆప్షన్ లేక అట్లీకి కబురుపెట్టారట అల్లు అర్జున్. ఇటు సల్మాన్‌ఖాన్‌తో మూవీని తేల్చుకోలేకపోతున్నాడు అట్లీ. ఈ తరుణంలో అల్లుఅర్జున్ నుంచి అట్లీకి కబురు అందడం మంచి అవకావంగా అనిపించింది అట్లీకి. ఇలా అట్లీ కూడా ఈ మూవీ చేయడానికి ఆల్మోస్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం వేకేషన్‌లో భాగంగా అల్లుఅర్జున్ స్పెయిన్ వెళ్లారు. వచ్చిన తర్వాత అల్లు అర్జున్–అట్లీ కాంబి నేషన్‌లోని మూవీపై ఓ క్లారిటీ రావొచ్చు.