‘జయ జయ జయ జయహే, ఫలిమై, సూక్ష్మదర్శిని’ వంటి మలయాళ సినిమాలతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు నటుడు బాసిల్ జోసెఫ్. కానీ బాసిల్ వీలైనప్పుడల్లా డైరెక్షన్ కూడా చేస్తుంటారు. 20 21లో మిన్నల్‌మురళి సినిమాను బాసిల్‌జోసెఫ్ డైరెక్ట్ చేస్తే, ఓటీటీలో బ్లాక్ బస్టర్ వ్యూస్ దక్కించుకుంది. కానీ ఆ తర్వాత బాసిల్ నటుడిగా సినిమాలతో బిజీ అయిపోయాడు.
కానీ ఇటీవల మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో బాసిల్ జోసెఫ్ (BasilJoseph) ఓ కొత్తను రెడీ చేశాడు.బాసిల్ ఈ కథను సూర్య కోసం రెడీ చేశారని, ఆల్రెడీ సూర్యకు కథ వినిపించారని, ఇక సెట్స్‌పైకి తీసుకుని వెళ్లడమే తరువాయి అన్న స్థాయిలో ఇటు కోలీవుడ్‌లో, ఇటు మాలీవుడ్ గాసిప్స్ గుప్పుమన్నాయి. కానీ సడన్‌గా ఇవన్నీ సద్దుమణిగాయి.
ఎందుకంటే…ఆల్రెడీ సూర్య ఇతర దర్శకులు (తెలుగు డైరెక్టర్స్ వెంకీ అట్లూరి, చందూ మొండేటి)లకు కమిట్‌మెంట్స్ ఇచ్చేశారట. దీంతో బాసిల్‌ను కాస్త వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టారట. కానీ ఈ టైమ్‌లో బాసిల్ ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసి ఓ కథ వినిపించారట. ఈ కథకు అల్లు అర్జున్ కూడా సూత్రప్రాయంగా అం గీకరించారట. దీంతో ఈ కథపై బాసిల్ మరింత వర్క్ చేస్తున్నారని, ఫైనల్ నరేషన్ తర్వాత అల్లు అర్జున్ నిర్ణయంపై ఈ మూవీపై ఓ క్లారిటీ రావొచ్చనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరి…సూర్యకు చెప్పిన కథనే అల్లుఅర్జున్‌కూ బాసిల్ చెప్పారా? లేక వేరొక కథను అల్లు అర్జున్‌కు విని పించారా? అనే విషయంపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.