‘పుష్ప 2’ సినిమా భారీ సక్సెస్ సాధించింది. అయితే ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్, సందీప్‌రెడ్డివంగాలతో అల్లు అర్జున్ సినిమాలకు కమిటైయ్యాడు. కానీ ప్రభాస్‌తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీతో సందీప్‌రెడ్డి వంగా బిజీగా ఉన్నారు. సో..అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్‌తోనే ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈక్వెషన్స్ మారిపోయాయి. ఇటీవల కొరటాల శివ ఓ కథను అల్లు అర్జున్‌కు వినిపించారట.
పూర్తి కథను రెడీ చేసి, మరో నరేషన్ ఇవ్వాలన్నట్లుగా కొరటాల శివను అల్లు అర్జున్ కోరారట. దీంతో ప్రస్తుతం ఆ పనిమీద ఉన్నారట కొరటాల శివ.
అయితే గతంలో అల్లు అర్జున్‌తో కొరటాల శివ ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. మరి…ఈ మూవీ అయినా వర్కౌట్ అవుతుందా? లేదా లెట్స్ వెయిట్ అండ్ సీ.
SSMB29: మహేశ్‌బాబు..రాజమౌళిల సినిమా ఓపెనింగ్ రేపే..!
మరోవైపు ఎన్టీఆర్‌తో కొరటాల శివ ‘దేవర’ సినిమా తీశారు. రెండు పార్టులుగా రానున్న ఈ మూవీ తొలి పార్టు 2024 సెప్టెంబరు 27న రిలీజైంది. తొలుత ఈ మూవీకి మిక్డ్స్ టాక్ వచ్చినా, ఆ తర్వాత ఫ్యాన్స్ సపోర్ట్‌తో హిట్‌గా నిలిచింది. అప్పట్లోనే ‘దేవర 2’ ఉంటుందా? అనే సందేహాలు వినిపించాయి. మరి.. ప్రస్తుత పరిస్థితులు ‘దేవర 2’ (Devara2)ను మరింత సందిగ్ధంలో పడేశాయి.