అనుకున్నట్లే జరుగుతోంది. సంక్రాంతి ఫెస్టివల్‌ను టార్గెట్‌గా చేసుకుని వసూళ్లను పెంచుకునేందుకు ‘పుష్ప ది రూల్’ టీమ్ (AlluArjun Pushpa2 )ప్లాన్ వేసింది. ఇందుకు అనుగుణంగా ‘పుష్ప ది రూల్’ సినిమాకు 20 నిమిషాల నిడివిగల ఫుటేజ్‌ని యాడ్ చేస్తూ, ‘పుష్పది రూల్’ కొత్త వెర్షన్ ‘పుష్ప ది రీలోడెడ్’ పేరుతో జనవరి 11న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తోంది.
కొత్తగా యాడ్ అయిన ఈ ఫుటేజీ ఏ మాత్రం ఆడియన్స్ కనెక్ట్ అయినా మళ్లీ ‘పుష్పది మూవీ’ (AlluArjun Pushpa2) సినిమా టికెట్లు ఈ సంక్రాంతి పండక్కి తెగుతాయాయి. మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఇది ‘పుష్పది రూల్’కు బాగా కలిసొచ్చే అంశమనే చెప్పుకోవాలి. హిందీలో ఇప్పటికే ఈ మూవీ రూ. 800 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇంకా అక్కడ ప్రదర్శించబడుతోంది.
Pushpa2Collections: ఇక దంగల్ జెండా దించుడే బ్యాలెన్స్…!
ఈ సంక్రాంతి సమయంలో హిందీ బెల్ట్‌లో కొత్తగా రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, సోనూ సూద్ ‘ఫతే’, బాలకృష్ణ ‘డాకుమహారాజ్’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. కానీ ‘గేమ్‌చేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమాలకు ఆశించినంత బుకింగ్స్ అయితే హిందీలో జరగడం లేదు. ఇది కచ్చితంగా పుష్ప టీమ్‌కు కలిసొచ్చే అంశమే. దీంతో పుష్ప వసూళ్లు మరింత పెరుగుతాయి.
Ramcharan Gamechanger: బ్రేక్ ఈవెన్‌కి గేమ్‌చేంజర్ ఎంత కలెక్ట్ చేయాలి?
అలాగే ఈ సంక్రాంతికి తెలుగులో విడుదల అవుతున్న gameChanger, ‘డాకుమహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాల్లో ఏ రెండింటికైనా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందంటే….అది కచ్చితంగా ‘పుష్ప’ టీమ్‌కు ఫ్లస్ అవుతుంది. వసూళ్లు మరింత బాగా పెరుగుతాయి. డిసెంబరులో సాగినట్లుగా, జనవరిలోనూ ‘పుష్ప’ మేనిమా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది. దీంతో ‘దంగల్’ రికార్డును ‘పుష్ప: ది రూల్’ మూవీ సులభంగా క్రాస్ చేస్తుంది. ఎప్పుడైతే ‘పుష్ప 2’ మూవీ వసూళ్లు రూ. 2000 కోట్లు దాటతాయో, అప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలస్తుంది. ప్రస్తుతం ‘పుష్ప’ టీమ్ టార్గెట్ అదే.