అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప ది రూల్’ (AlluArjun Pushpa2) చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1830 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో ‘పుష్ప ది రూల్’ మూవీ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్ల కలెక్ష న్స్‌తో తొలిస్థానంలో ఉన్న భారతీయ హిందీ మూవీ ‘దంగల్’ను ‘పుష్ప 2’ దాటలేకపోయింది. కానీ ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా మాత్రం పుష్ప 2 నిలిచింది. అలాగే బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘పుష్ప 2’ (AlluArjun Pushpa2) నిలిచింది.
కారణాలు బోలెడు
‘పుష్ప 2’ చిత్రం డిసెంబరు 5న రిలీజ్ కావడం బాగా కలిసొచ్చింది. ఈ నెలలో మరో స్టార్ హీరో మూవీ రిలీజ్ కాకపోవడం, క్రిస్మస్‌కు రిలీజైన ఒకట్రెండు తెలుగు సినిమాలు కూడా ఆడియన్స్‌ను ఆకర్షించక పోవ డం వంటివి, ‘పుష్ప 2’ (AlluArjun Pushpa2) మూవీకి బాగా కలిసొచ్చాయి. కానీ ‘పుష్ప 2 రిలీ లోడెడ్ వెర్షన్’ ఊహించిన స్పందన రాలేదు.
ఇదే సమయంలో సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, బాలకృష్ణ ‘డాకుమహారాజ్’, మరీ ముఖ్యంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కావడంతో ‘పుష్ప 2’పై ఆడియన్స్ మక్కువ తగ్గిపోయింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో ‘పుష్ప 2’ ఆడియన్స్ మర్చిపోయారు. ఇలా ‘పుష్ప 2’ కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. హిందీలోనూ కొత్త సినిమాలు రావడం, ఇతర భాషల సినిమాలు హిందీలో డబ్ కావడం వంటి వాటితో…‘పుష్ప 2’మూవీ కలెక్షన్స్ తగ్గాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ ‘దంగల్’ కలెక్షన్స్‌ను దాటడం అన్నది కల్లే.
కల నెరవేరే మార్గలు ఉన్నాయి
ప్రపంచవ్యాప్తంగా ‘దంగల్’ మూవీ రూ. 2000 వేలకోట్లను వసూలు చేసింది. నిజానికి దంగల్ చిత్రానికి ఇండియాలో వచ్చింది రూ. 1000 కోట్ల లోపే. దంగల్ మెజారిటీ కలెక్షన్స్ చైనా నుంచి వచ్చాయి. ‘దంగల్’ మూవీని చైనాలో రిలీజ్ చేస్తే, అక్కడ రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇటీవల విజయ్‌సేతుపతి ‘మహారాజా’ను రిలీజ్ చేస్తే, చైనాలో రూ. 50 కోట్లకు పైగా వచ్చాయి. ఇలా ‘పుష్ప 2’ను కూడా తెలుగు సినిమాలకు మార్కెట్ ఉన్నా చైనా, జపాన్ వంటి దేశాల్లో రిలీజ్ చేస్తే, రూ. 200 కోట్లు కలెక్షన్స్ రావొచ్చు. ఇలా ‘దంగల్’ మూవీని అధికమించవచ్చు. కానీ ఇందుకు ఖర్చు అవుతుంది.
అందుకే వద్దనుకుంటున్నారా?
రాజమౌళి డైరెక్షన్ మూవీలో మహేశ్‌బాబు మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఎలాగూ అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి… ‘దంగల్’ కలెక్షన్స్‌ను అధికమిస్తుంది. ఇప్పుడు ఖర్చుపెట్టుకుని మరీ ‘దంగల్’ను ‘పుష్ప 2’ అధికమించినా కూడా, ఈ రికార్డులను కూడా మహేశ్‌బాబు అధికమిస్తాడు. కాబట్టి…అల్లు అర్జున్ అండ్ టీమ్ ఈ విషయంలో అన వసరపు ఖర్చు ఎందుకని సైలెంట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది.
తుదిపరి చిత్రం
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ఓ మూవీ చేయనున్నారని, సోషియో ఫ్యాంటసీగా రానున్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని, మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అలాగే సందీప్‌రెడ్డి వంగాతో అల్లు అర్జున్ ఓ మూవీ చేయాలి. కానీ ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా సమయం ఉంది.