‘పుష్ప: ది రూల్’ సినిమాలోని గంగమ్మజాతర ఎసిపోడ్‌లో మంచి గెటప్‌తో అల్లు అర్జున్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. దీంతో తన యాక్టింగ్‌లోని డిఫరెంట్ యాంగిల్స్‌ని బయటపెట్టాలని అల్లు అర్జున్ (AlluArjun) నిర్ణయించుకున్నాడు.
అట్లీతో మూవీ
తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీకి చెందిన ఏర్పా ట్లు చకా చకా జరుగుతున్నాయి. కాగా, ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా…ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్ట్ చేయనున్న ఓ రోల్ నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఇప్పటివరకు ఆడియన్స్ అల్లు అర్జున్‌ను నెగటివ్ షేడ్స్‌లో చూడలేదు. ఇలా కొత్తగా అల్లు అర్జున్ ఆడియన్స్ కనిపిస్తే తప్పక ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనుకోవడంలో ఆశ్చర్యం లేదు. మరి..ఏం జరుగుతుందో చూడాలి.
బర్త్ డేకి అనౌన్స్‌మెంట్
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ దాదాపు రూ. 170 కోట్లు పారితోషికం తీసుకోనున్నారట. పైగా ఈ మూవీ లాభాల్లో కొద్దిమొత్తంగా వాటాలు అడిగారట. అయితే ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఇంకా నెక్ట్స్ చిత్రాలు
దర్శకుడు త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇంకా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, రాజమౌళి, కొరటాల శివ, సురేందర్‌రెడ్డి, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో అల్లు అర్జున్ భవిష్యత్‌లో సినిమాలు చేయనున్నారు. అట్లీ తర్వాత మోస్ట్‌లీ త్రి విక్రమ్‌తో అల్లు అర్జున్ మూవీ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.