AlluArjun Arrest: అల్లు అర్జున్ (AlluArjun) ‘పుష్ప ది రూల్’ సినిమా ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబరు 4 రాత్రి హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్న కారణంగా, తెలంగాణ పోలీసులు అల్లుఅర్జున్‌ను డిసెంబరు 13న అరెస్ట్ చేశారు. డిసెంబరు 13 సాయంత్రం తెలంగాణ హైకోర్టులో జరిగిన వాదోపవాదాల అనంతరం అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ జైలు అధికారులకు బెయిల్ పేపర్ కాపీలు నిర్ణీత సమయంలోపు అందక పోవడం, రాత్రివేళ రిలీజ్‌లు ఉండకూడదన్న రూల్స్… వంటి సాంకేతిక పరమైన కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ డిసెంబరు 13 రాత్రి జైలులోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరు 14 ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అవుతారన్న వార్తలు మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. డిసెంబరు 14 ఉదయం వరకు జైలులోని క్లాస్ 1 బ్యారక్‌లో అల్లు అర్జున్ ఉండాల్సి ఉంటుంది.
#WATCH | Hyderabad, Telangana: On the release of actor Allu Arjun, Srinivas Rao, Additional DCP Task Force, says, “He (Allu Arjun) will be released tomorrow morning… I don’t know the reasons… He will be released tomorrow morning…” pic.twitter.com/9Rf1WclV1o
— ANI (@ANI) December 13, 2024
AlluArjunArrest: అల్లు అర్జున్ అరెస్ట్…అసలు ఏం జరిగింది?
అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే, విషయం తెలుసుకున్న చిరంజీవి, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఆ వెంటనే నాగబాబు వెళ్లారు. వీరే కాదు…రానా దగ్గుబాటి, దర్శకుడు రాఘవేంద్రరావు…ఇలామరికొంతమంది ప్రముఖులు వెళ్లారు. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ‘దిల్’ రాజు, నిర్మాత సూర్యదేవరనాగవంశీ, మైత్రీమూవీమేకర్స్ రవిశంకర్, దర్శకుడు త్రివిక్రమ్‌లు అయితే అల్లు అర్జున్‌ను ఫాలో అయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వీరు వెళ్లారన్న వార్తలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు సపోర్ట్‌గా నాని, అడివి శేష్, నితిన్, సందీప్‌కిషన్, రష్మికా మందన్నా వంటి స్టార్స్ సోషల్‌మీడియా మాధ్యమాల్లో పోస్టులు షేర్ చేశారు. బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్, నటుడు–ఎంపీ రవికిషన్, వివేక్ ఒబెరాయ్ వంటి వారు కూడా అల్లు అర్జున్‌కు సపోర్ట్‌గా నిలిచారు.