AlluArjunArrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌…అసలు ఏం జరిగింది?

Viswa
2 Min Read

AlluArjunArrest: ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. అల్లు అర్జున్‌  (Alluarjun) హీరోగా నటించిన ‘పుష్ప ది రూల్‌’ సినిమా డిసెంబరు 5న విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రీమియర్‌ షోను డిసెంబరు 4న హైదరాబాద్‌ ఆర్‌టీసీక్రాస్‌ రోడ్స్‌లోని ప్రధాన థియేటర్‌ (పుష్ప ది రూల్‌ సినిమా మెయిన్‌ థియేటర్‌) సంధ్యలో ప్రదర్శించారు.ఈ సెకండ్‌ షో సినిమాకు అల్లు అర్జున్‌ వెళ్లారు. అయితే ఇదే సమయంలో ఈ షోను చూసేందుకు రేవతి, ఆమె కుటుంబం దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అల్లు అర్జున్‌ రావడం, అదే సమయంలో షోను ప్రదర్శించేందుకు థియేటర్‌ గేట్స్‌ ఓపెన్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్ఠకరమైన తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. ఆమె కుమారుడు కూడా గాయపడ్డారు. కాగా అల్లు అర్జున్‌సడన్‌గా ప్రిమియర్‌ షోకు రావడం వల్లే ఇలా జరిగిందని, రేవతి భర్త ఆరోపించారు. మరోవైపు అల్లుఅర్జున్‌ వస్తున్న విషయం పట్ల మాకు సరైన సమాచారం ఇవ్వలేదని, దీంతో భద్రతాపరమైన చర్యలుతీసుకోలేకపోయామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంథ్య ధియేటర్‌ యాజమాన్యం, అల్లు అర్జున్‌లపై కేసులు నమోదు అయ్యాయి.

Aluuarjun Response for Sandhya Theatre Sad incident: విషయం తెలియగానే షాక్‌ అయ్యాం..సెలబ్రేషన్స్‌ చేసుకోలేకపోయాం..నిరుత్సాహపడ్డాం: అల్లు అర్జున్‌

అయితే విషయం తెలిసిన తర్వాత అల్లు అర్జున్‌ ఈ ఘటనపై స్పందించారు. గత ఇరవై సంవత్సరాలుగా తాను ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సినిమాలు చూస్తున్నానని, ఇప్పుడు ఇలా జరగడం బాధాకరమైన విషయ మని ఆయన వాపోయారు. అలాగే బాధిత కుటుంబానికి తక్షిణ సాయం కింద పాతిక లక్షల రూపాయాలుఇస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఇంతటితో ఈ కేసు అంతా ముగిసిపోయిందని అనుకున్నారు. కానీఈ కేసు పరిశోధన జరుగుతూనే ఉంది.

డిసెంబరు 13 శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్‌ ఇంటికి వచ్చి, ఆయన్ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు.ఆయనపై నాలుగైదు రకాల కేసుల్లో అల్లు అర్జున్‌ నిందితుడు అన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక వైద్యపరిక్షీల నిమిత్తం అల్లు అర్జున్‌ను ఉస్మానియాఆస్పత్రికి తీసుకుని వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మరిన్ని పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

 

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *