Aluuarjun Response for Sandhya Theatre Sad incident: అల్లు అర్జున్ ‘పుష్ప2 ది రూల్’ సినిమా డిసెంబరు 5న థియేటర్స్‌లో రిలీజైంది. కాగా డిసెంబరు 4న ఈ సినిమా ప్రిమియర్స్ షోలను ప్రదర్శించారు. అయితే హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్స్‌లో పుష్ప ది రూల్’ సినిమా మెయిన్ థియేటర్ సంధ్య సినిమా హాల్. ఈ సినిమా హాల్‌లో ఫ్యాన్స్‌తో కలిసి ‘పుష్ప2’సినిమాను చూసేందుకు అల్లు అర్జున్ హాజరైయ్యారు. సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వస్తున్నారన్న విషయం తెలియడంతో అక్కడికి భారీగా ఆడియన్స్ వచ్చారు. అల్లు అర్జున్‌రాగానే థియేటర్ తలుపులు తెరచుకున్నాయి. దీంతో జనం ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది.
#Pushap2TheRule#PushpaTheRule#Pushpa2Celebrations#Hyderabadpic.twitter.com/DTCMgh3mSQ
— TollywoodHub (@tollywoodhub8) December 4, 2024
ఊహించినదాని కంటేఆడియన్స్ ఎక్కువగా రావడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. దురదృష్ఠవశాత్తు ఈతొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. ఈ సంఘటనపై తాజాగా అల్లు అర్జున్ ఓ వీడియోను రిలీజ్‌చేశారు.
‘‘ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని మెయిన్ థియేటర్ సినిమా చూడటం అనే అనవాయితీ ఇరవై సంవత్సరాలుగా ఉంది. కానీ ఈ సారి జరిగిన విషాదకర ఘటన మమ్మల్నీ తీవ్రంగా కలిచివేసింది. రేవతిగారి మరణం..నాతో పాటుగా, మా ‘పుష్ప 2’ టీమ్ అందర్నీ ఎంతగానో బాధించింది. ఈ విషాదకర వార్త వినగానే చాలా నాతో పాటుగా, ‘పుష్ప 2’ టీమ్ సభ్యులం అందరం నిరుత్సాహపడ్డాం. ఉత్సాహంగా ఈ సినిమా విక్టరీ సెలబ్రే షన్స్ చేసుకోలేక పోయాం. షాక్ అయ్యాం. మేం సినిమాలు తీసేదే ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి, సినిమా చూసి ఏంజాయ్ చేయాలని. అలాంటిది ఇలా జరగడం బాధగా అనిపించింది. సినిమాలు చేసేందుకు వచ్చేప్పుడు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. ఇక రేవతిగారి మరణం వారి కుటుంబ సభ్యలుకు భర్తీ చేయలేనిది. నా వంతుగా పాతిక లక్షల రూపాయాలను ఇస్తున్నాను. ఇదేదో డబ్బు ఇవ్వాలని కాదు…వారికి తోడుగా నేను ఉన్నానని చెప్పడానికి. అలాగే వైద్య ఖర్చులను భరిస్తాను’’ అని అల్లు అర్జున్ ఓ వీడియో బైట్‌లో పేర్కొన్నాడు.
మరోవైపు సంధ్య థియేటర్‌లో జరిగిన విషాదకర ఘటనపై పోలీసుల ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఈ విషయంలో ‘పుష్ప2’ టీమ్ మీద కేసులు నమైదయ్యాయని వార్తలు వస్తున్నాయి.

ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించారు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఫాహద్‌ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, తారక్ పొన్నప్ప, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పాటలు కొంత మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ అందించగా, మరికొంత బ్యాగ్రౌండ్ స్కోర్ తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ అందించారు.