సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్‌గా చేసిన కో స్టార్స్ పెళ్లి చేసుకోవడం కామన్. ఇలా చాలా ఉదా హరణలు ఉన్నాయి. లేటెస్ట్‌గా అనుపమా పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్(సీనియర్ హీరో విక్రమ్ తనయుడు) (Anupamaparameswaran loves Dhruv vikram)ల పేర్లు తెరపైకి వచ్చాయి.
మారిసెల్వరాజన్ డైరెక్షన్‌లో ధ్రువ్ విక్రమ్, అనుపమాపరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లు ‘బైసన్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపుదిద్దుకుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కానీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి రెండేళ్లకుపైనే సమయం పట్టింది. ఈ మూవీ ప్రయాణంలోనే అనుపమాపరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్‌లు ప్రేమలో పడ్డారని, కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
లేటెస్ట్‌గా ధ్రువ్ విక్రమ్, అనుపమాపరమేశ్వరన్‌లు కిస్ పెట్టుకున్నట్టుగా ఉన్న కొన్ని ప్రవైటు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసే….అనుపమా పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్‌ల డేటింగ్‌ను కన్ఫార్మ్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ విషయంపై థ్రువ్, అనుపమాలు స్పందిస్తే..ఓ క్లారిటీ రావొచ్చు. ఎందుకంటే.. వైరల్ అవుతున్న ఈ రొమాంటిక్ స్టిల్ ‘బైసన్’ మూవీలోది కూడా కావొచ్చు.
అనుపమాపరమేశ్వరన్ యాక్ట్ చేసిన తమిళ సినిమా లాక్‌డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ..సినిమాలు షూటింగ్‌లు పూర్తి చేసుకుని, రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.