అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun son of Vyjayanthi Movie Pre Review)సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ‘బింబిసార, డెవిల్, అమిగోస్’ వంటి ప్రయోగాత్మక చిత్రాల తర్వాత కళ్యాణ్‌రామ్ నుంచి రాబోతున్న మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో విజయశాంతి యాక్ట్ చేయడం మరో మేజర్‌ప్లస్ పాయింట్. ఈ మూవీ ఈ రోజు (ఏప్రిల్ 18)న థియేటర్స్‌లో రిలీజైంది. ఇప్పటివరకు చిత్రంయూనిట్ ఈ సినిమా గురించి, ఈ సినిమా ప్రమోషన్స్ చెప్పిన విషయాలు, టీజర్, ట్రైలర్‌ను బట్టి…ఈ సినిమా రివ్యూపై ఓ అంచనాకు రావొచ్చని తెలుస్తుంది. ఎందుకంటే…ఈ మూవీ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీయే అయినప్పటికీని, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. తెలుగు సినిమా కర్షియల్ ఎలిమెంట్స్ కాస్త రోటీన్‌గా ఉంటాయి కాబట్టి, కొంత మేర కథను ఊహించగలిగే అవకాశాలు ఉంటాయి.
కథ ఇలా ఉండొచ్చు..!
ట్రైలర్‌లోని విజువల్స్ బట్టి….యూపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటాడు అర్జున్ విశ్వనాథ్ (కళ్యాణ్‌రామ్). అతని తల్లి వైజయంతి ఐపీఎస్ పోలీసాఫీసర్ (విజయశాంతి). తన కొడుకును ఓ ఐపీఎస్‌గా చూడాలని కోరుకుంటుంది. అర్జున్ కూడా తల్లి ఆశను నెరవేర్చాలనే అనుకుంటాడు. కానీ ఊహించని రితీలో ఓ పెద్ద రౌడీ–ఖైదీ (సోహైల్‌ఖాన్) వల్ల ఓ సమస్య వచ్చిపడుతుంది. దీంతో అర్జున్ విశ్వనాథ్ తన లక్ష్యానికి దూరమైపోతాడు. పైగా పోలీస్ డిపార్ట్‌మెంట్ దృష్టిలో క్రిమినల్ అయిపోతాడు (Arjun son of Vyjayanthi Movie Review)

తప్పు చేసింది ఎవరైనా సరే…ఏ మాత్రం క్షమించని వైజయంతి, కొడుకు అని కూడా చూడకుండ అర్జున్‌ను అరెస్ట్ చేస్తుంది. తాను చేసే పనిలో అర్జున్ కరెక్ట్. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడంలో వైజయంతీ కరెక్ట్. ఇలా తల్లీకొడుకులు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ల వాళ్ల ఐడియాలజీలో కరెక్ట్‌గా ఉంటారు. కానీ వెళ్తున్న దారులు, భావాలే డిఫరెంట్. మరి..ఈ తల్లీకొడుకుల కథ ఫైనల్‌గా ఏమైంది? అన్నదే ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది. వైజాగ్ నేపథ్యంతో ఈ మూవీ ఉంటుంది. ఓ ప్రాంతవాసులకు అండగా నిలబడే వ్యక్తిగా అర్జున్ పాత్రలో మాస్‌గా కళ్యాణ్‌రామ్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.
థీమ్ ఇదేనా..?
‘‘మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మన బర్త్ డేలను ఓ ఎమోషన్‌తో చేస్తారు. మనం పెరిగి పెద్దయిన తర్వాత మన తల్లిదండ్రుల బర్త్ డేలను గుర్తుపెట్టుకుని, వారి బర్త్ డేలను కూడా సెలబ్రేట్ చేయడం అనేది ఓ ఎమోషన్. ఓ రకంగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా థీమ్ ఇదే’’ అని ఈ చిత్రం దర్శకుడు ప్రదీప్ చిలుకూరి చెప్పారు. టీజర్, ట్రైలర్స్‌లో…విజయశాంతికి కళ్యాణ్‌రామ్ బర్త్ డే శుభాకాంక్షలు చెబుతుండటం
మనం గమనించవచ్చు. అయితే కళ్యాణ్‌రామ్ మూడునాలుగుసార్లు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తారు. సో… అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా కథ నాలుగైదు సంవత్సరాల టైమ్‌లైన్‌లో జరుగుతుందని ఊహింవచ్చు.
పైగా…తాను పోలీస్‌ను అవ్వాలనుకున్న తల్లి ఆశను తీర్చలేకపోతున్నాను కాబట్టి…కనీసం పోలీస్ డ్రెస్ వేసుకుని అయినా…ఆ పని చేస్తానన్న డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. సో…కథ రిత్యా …కళ్యాణ్‌రామ్ పోలీస్ ఆఫీసర్ కాకపోయినా…ఖాకీ యూనిఫార్మ్‌లో విలన్లను ఓ ఆటాడుకుంటాడని ఊహింవచ్చు. ఎలాగూ ఈ సినిమా క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి….అప్పటివరకు క్రిమినల్‌గా ఉన్న కళ్యాణ్‌రామ్ సడన్‌గా పోలీసాఫీసర్ అయిన ఆడియన్స్ ఆశ్చర్యపోనక్కర్లేదు.
ట్రైలర్‌లో పృథ్వీరాజ్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాడు. మరో విజువల్‌లో..క్రిమినల్‌గా మారిన కళ్యాణ్‌రామ్ గ్యాంగ్‌లో కీలకంగా ఉంటాడు. సో…కథను మలుపుతిప్పే పాత్ర పృథ్వీరాజ్ దే అయిఉండొచ్చు. ట్రైలర్‌లో. .శ్రీకాంత్ పాత్రను చాలా అండర్ ప్లే చేశారు. శ్రీకాంత్ క్యారెక్టర్‌కు కథలో ఇంపార్టెన్స్ ఉండొచ్చు. ఎక్కువగా రివీల్ కాకూడదని, కావాలనే శ్రీకాంత్ విజువల్స్ ట్రైలర్‌లో తక్కువ కట్ చేసి ఉండొచ్చు.
ఈ మూవీ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి…కల్యాణ్‌రామ్, విజయశాంతి క్యారెక్టరైజేషన్స్‌లో మంచి ఎమోషన్ ఉండొచ్చు. ముఖ్యంగా ‘అతనొక్కడే, పటాస్’ సినిమాల్లో మూవీలో ఉన్న ఎమోషన్స్ ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలోని క్యారీ అవుతాయని దర్శకుడు ప్రదీప్ చెబుతున్నారు.
పటాస్ ఛాయలు
పటాస్ సినిమాకు ఫ్లిప్‌గా కూడా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఉంటుందనంటున్నారు. పటాస్‌లో తండ్రీకొడుకుల (కళ్యాణ్‌రామ్-సాయికుమార్) ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అదే..అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో తల్లికొడుకుల (కల్యాణ్‌రామ్-విజయశాంతి) ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అయితే పటాస్‌ను కాస్త కామిక్ వే చెప్పారు ఆ చిత్ర దర్శకుడు అనిల్‌రావిపూడి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో మాత్రం..ఎమోషన్‌ను సీరియస్ టోన్ ప్రెజెంట్ చేసినట్లుగా తెలిసింది.
క్లైమాక్స్‌లో ఏం జరుగుతుంది?
ఇక ఈ సినిమాకు ప్రధానబలం క్లైమాక్స్ అనే చిత్రంయూనిట్ మొదట్నుంచి చెబుతూనే ఉంది. సో.. .క్లై మాక్స్‌లో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయనే ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొని ఉంది. తల్లి వైజయంతికి, ఆమె కొడుకు కళ్యాన్‌రామ్ బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపే, సన్నివేశం అయితే ఉంటుంది. ఇంకా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా? ఏదైనా నెగటివ్ క్లైమాక్స్ ప్లాన్ చేశారా? అనేది చూడాలి.
ఆరు ఫైట్ సీక్వెన్స్‌లు!
ఈ సినిమాకు మరో మేజర్ పార్ట్ యాక్షన్ సన్నివేశాలు. సినిమాలో ఐదారు యాక్షన్ బ్లాక్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయశాంతి ఇంట్రో యాక్షన్ బ్లాక్‌ను పృథ్వీ మాస్టర్, ఇంట్రవెల్ అండ్ క్లైమాక్స్ బ్లాక్‌లను రామకృష్ణ మాస్టర్, హీరో ఇంట్రడక్షన్ ఫైట్‌ను పీటర్ హెయిన్స్ మాస్టర్, విలన్ (బాలీవుడ్ నటుడు సోహైల్‌ఖాన్) రెండు సీక్వెన్స్‌లను రఘు వరణ్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఇలా సినిమాలో ఆరు మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. సో..స్క్రీన్‌పై యాక్షన్ ఆడియన్స్‌కు ఫుల్ మాస్ మీల్స్ అయితే దొరుకుతాయి. కాంతార, విరూపాక్ష, ఓదెల వంటి సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ వంటి కమర్షియల్ అండ్ ఎమోషనల్ మూవీకి సంగీతం ఇచ్చాడు. సో..అజనీష్ లోకనాథ్ కమర్షియల్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాకు ఎంత ఫ్లస్ అవుతుంది? అనేది కూడా ఆసక్తికరమైన అంశమే.