హీరో కల్యాణ్‌రామ్ లేటెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son of vyjayanthi Trailer) ఈ చిత్రంలో తల్లికొడుకుల పాత్రలో కళ్యాణ్‌రామ్, విజయశాంతి కలిసి నటించారు. తల్లి వైజయంతి ఐపీఎస్ పాత్రలో విజయశాంతి, అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు
(ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). యాక్షన్ ప్యాక్డ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. తల్లి పోలీసాఫీసర్. తన కొడుకు కూడా పోలీసాఫీసర్ కావాలను కుంటుంది. ఇందుకు కొడుకు కూడా సిద్ధమవుతాడు. కానీ ఓ కారణం చేత పోలీసు కావాల్సిన అర్జున్ క్రిమినల్ అవుతాడు. ఎందుకు? ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.
ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్. సునీల్ బలుసు, అశోక్ వర్థన్ నిర్మాతలు. సోహైల్ అలీఖాన్ విలన్ రోల్ చేశాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా, శ్రీకాంత్, పృథ్వీరాజ్‌లు ఇతర సపోర్టింగ్ రోల్స్ చేశారు.