Thamma Trailer: రష్మికా మందన్నా (Rashmika) లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘థామా’. ఆయుష్మాన్ ఖురానా (Ayushmann), నవా జుద్దీన్ సిద్ధిఖీ (Nazazuddin), పరేష్‌రావల్, సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్(ఎమ్‌హెచ్‌సీయూ) లో రూపొందిన ఈ ‘థామా’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లోని బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘స్త్రీ, స్త్రీ2’ చిత్రాల్లో నటించిన శ్రద్ధాకపూర్ ‘థామా’ సినిమా హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘ఎమ్‌హెచ్ సీయూ’ లోని ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోర్థార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా థామా సినిమా అక్టోబరు 21న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
‘‘నువ్వు నాతో కలిసి ఉండలేవు. మా ప్రపంచం వేరు, అలోక్ నీ పళ్ళు చూపించు ఓ సారి, నా కొడుకు సైతాన్..సైతాన్…., సింగం సినిమా 8 సార్లు చూశాను’’ అంటూ మీనింగ్ వచ్చే హిందీ డైలాగ్స్ ‘థామా’ సినిమా హిందీ ట్రైలర్‌లో ఉన్నాయి. ట్రైలర్‌ను బట్టి, ఈ సినిమాలో హారర్, కామెడీయే కాదు..లవ్‌స్టోరీ కూడా ఉండబోతున్నట్లుగా స్పష్టం అవుతోంది.
ఈ చిత్రంలోని అలోక్ పాత్రలో ఆయుష్మాన్ఖు రానా, తడ్కా పాత్రలో రష్మిక మందన్నా, యక్ష సాన్ గా నవాజుద్దీన్, రామ్ బజాజ్ గోయెల్‌గా పరేశ్‌రావల్ నటించారు. సత్యరాజ్ కూడా మరో కీలక పాత్ర పోషించారు. అలాగే శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్‌లు సైతం ‘థామా’ సినిమాలో గెస్ట్ రోల్స్ చేసినట్లుగా తెలిసింది.