బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఆదిత్య39’ (Balakrishna Aditya369). సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో రూపొందిన ఈ టైమ్ ట్రావెల్ మూవీ 1991 జూలై 18న విడుదలై, సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శ్రీదేవి మూవీస్, ఎస్ అనితా కృష్ణ, దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం ఈ సినిమాకు సమర్పకులు. అప్పటిఈ బ్లాక్‌బస్టర్ మూవీని, ఇప్పుడు థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ‘ఆదిత్యా 369’ సినిమాను ఏప్రిల్ 11న థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఆదిత్య 369’ సినిమాను 4కెలో డిజిటలైజ్ చేశామని, 5.1 సౌండ్ క్వాలిటీలోకి కన్వర్ట్ చేశామని, ఇది ఆడియన్స్‌కు మరోసారి అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చెబు తున్నారు.
సీక్వెల్‌కు బాలకృష్ణ డైరెక్షన్
ఆదిత్య369 సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 మూవీ రానుందని, ఈ సినిమాకు తానే కథ రాశానని బాల కృష్ణ ఓ సందర్భంగా చెప్పారు. అంతేకాదు.. ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ఆదిత్య 999 కోసం దర్శకుడిగా తొలిమెగాఫోన్ పట్టనున్నారు బాలకృష్ణ.ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా నటించే చాన్సెస్ ఉన్నాయని తెలిసింది.
అఖండ సీక్వెల్‌తో బిజీ
ప్రస్తుతం ‘అఖండ 2’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. బోయపాటి డైరెక్షన్‌లో ఈ మూవీ రూపొందు తోంది. బాలకృష్ణతో ‘లెజెండ్’ సినిమాను నిర్మించిన గోపీ ఆచంట, రామ్ ఆచంట ఈ మూవీని నిర్మిస్తు న్నారు. సంయుక్త హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.