నటీనటులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్, మాస్టర్ శాండీ, తనికెళ్లభరణి, మకరంద్‌దేశ్‌పాండే, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం
దర్శకుడు: కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాణం: సాహు గారపాటి
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
కెమెరా: చిన్మయ్ సలాస్కర్
సంగీతం: చేతన్ భరద్వాజ్
విడుదల తేదీ: సెప్టెంబరు 12
నిడివి: 2 గంటల 5 నిమిషాలు
రేటింగ్ 2.75 /5
Kishkindhapuri Telugu Review: కథ
దెయ్యాల గురించి తెలుసుకోవాలనుకునే ఉత్సుకత, ఆసక్తి ఉన్నా ఔత్సాహికులను, ఉత్సాహవంతులను కిష్కింధపురిలోని హాంటెంట్‌హౌస్‌లకు ‘ఘోస్ట్ వాకింగ్ టూర్’ పేరుతో తీసుకు వెళ్తుంటాడు రాఘవ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్). రాఘవ్ టీమ్‌లో మైథిలి (అనుపమా పరమేశ్వరన్), సుమిత్ (సుదర్శన్) ఉంటారు. ఇలా ఓ సారి కిష్కింధపురిలోని హౌంటెడ్ హౌస్ అయిన ‘సువర్ణమాయ రేడియో స్టేషన్’కు 11మంది ఘోస్ట్ వాకింగ్ టూర్‌కు వెళ్తారు. కానీ అక్కడ ఊహించని రితిలో కొన్ని పరిణామాలు జరుగుతాయి. సువర్ణమాయ రేడియో స్టేషన్‌లో నిజంగానే దెయ్యం ఉంటుంది. సువర్ణమాయ రేడియో స్టేషన్‌లోకి వచ్చిన 11 మందిలో ఒక్కొక్కరిని చంపుతుంటుంది ఈ దెయ్యం. అలా ముగ్గుర్నీ చంపేస్తుంది. మరి…మిగిలిన 8 మందిని రాఘవ్ ఎలా కాపాడాడు? అసలు ఈ దెయ్యం ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? విస్రమపుత్ర (మాస్టర్ శాండీ)ని చంపింది ఎవరు? కట్టడి చేసింది ఎవరు? అన్న ఆసక్తికరమైన అంశాలను థియేటర్స్‌లోనే చూడాలి (Kishkindhapuri Review)
విశ్లేషణ
‘కిష్కింధపురి’ టీమ్ చెబుతున్నట్లుగా, ఇది రెగ్యులర్ హారర్ ఫిల్మ్ అయితే కాదు. తెలుగు ఆడి యన్స్‌కు కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. 1989లో జరిగే ఓ హారర్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రస్తుత సీన్‌లోకి వస్తుంది. హీరో–హీరోయిన్లు ఇంట్రడక్షన్ సీన్స్, ‘ఘోస్ట్ వాకింగ్ టూర్’ కాన్సెప్ట్, ఓ లవ్‌సాంగ్‌తో తొలి 20 నిమిషాలు సినిమా కాస్త స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే, హీరో అండ్ టీమ్…‘ఘోస్ట్ వాకింగ్ టూర్’లో భాగంగా సువర్ణమాయ రేడియోస్టేషన్ హాంటెడ్‌హౌస్‌కు వెళ్తారో అప్పట్నుంచి సినిమాలో వేగం పెరుగుతుంది. కథపై క్యూరియాసిటీ పెరుగుతుంది. వరుస చావులతో ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. దెయ్యంని హీరో కనిపెట్టే సీన్‌తో ఇంట్రవెల్ బ్యాంగ్ వస్తుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ బాగుంది. దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఈ దెయ్యం హీరోని చంపడానికి చేసే ప్రయత్నాలు, ఈ దెయ్యాన్ని హీరో అంతం చేయడానికి చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే ఒకట్రెండ్ ట్విస్ట్‌లు బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో అనుపమ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ల పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. కానీ క్లైమాక్స్ రోటీన్‌గానే ఉంది.
థ్రిల్, ట్విస్ట్, హారర్ ఫీల్ విషయంలో ‘కిష్కింధపురి’ సినిమా టీమ్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. కానీ కథలో కొన్ని లోటుపాట్లు, లాజిక్ లెస్ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. రెడియోను వారధిగా చేసుకున్న దెయ్యం, ఫోన్ ద్వారా కూడా వస్తున్నప్పుడు రెడియోలను తగల బెట్టడంలో అర్థం లేదు. ఓ డిఫరెంట్ లైట్‌కు దెయ్యం భయపడు తున్నప్పుడు, ఈ టైప్ లైట్ ఉన్న టార్చ్‌ని హీరో మెయిన్‌టెయిన్ చేస్తే చాలు కదా!. మూడో మర్డర్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎలాంటి రెడియో ఉండదు. కానీ దెయ్యం రావడం నప్పలేదు. అలాగే.. భయపడిన వారిని దెయ్యం సులభంగా ఆవహిస్తుందంటాడు హీరో. కానీ హీరో భయపడకుండానే, దెయ్యం అతన్ని ఆవహిస్తుంది…
ఇలాంటికి మరికొన్ని ఉన్నాయి. సినిమా ప్రారంభ సన్నివేశాన్ని, సినిమా ప్రీ క్లైమాక్స్‌తో కనెక్ట్ చేసిన తీరు బాగుంది. విలన్ పాత్ర క్యారెక్టరైజేషన్‌లోని ట్విస్ట్‌లు, హారర్ థ్రిల్ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్ సెటప్ బాగుంది.
నటీనటులు-సాంకేతిక నిపుణులు
రాఘవ్‌గా బెల్లంకొండ (Bellamkonda saisrinivas) మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంట్రడక్షన్ సీన్, పాపను కాపాడే సీన్, ప్రీక్లైమాక్స్ సీన్స్‌లో మంచి నటన కన బరచాడు. మైథిలీగా అనుపమ క్యారెక్టర్ ఒకే. కానీ సెకండాఫ్‌లో వచ్చే ఓ హాస్పిటల్ సీన్‌లో అనుపమ యాక్టింగ్ మెప్పిస్తుంది. ఇక విలన్‌గా, విస్రమపుత్రగా చేసిన శాండి యాక్టింగ్ సూపర్. ఈ సినిమా సెకండాఫ్‌లో మేజర్ హైలెట్‌గా ఉంటుందీ శాండి యాక్టింగ్. చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దివ్యాంగుడిగా శాండి అప్పీరియన్స్, యాక్టింగ్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. హీరో ఫ్రెండ్ సుమిత్‌గా సుదర్సన్ యాక్టింగ్ ఒకే. సుదర్శన్ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ కాస్త తక్కువే. ఉన్నంతలో విహారి పాత్రలో హైపర్ ఆది నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్, భద్రమ్, తనికెళ్లభరణి..వంటివారు వారి వారి పాత్రల పరిధి మేర యాక్ట్ చేశారు. దర్శకుడు కౌశిక్ మంచి రైటింగ్ చేశాడు.
కౌశిక్ ఈ సారి ఆకట్టుకున్నాడు. కాస్త సెకండ్ హాఫ్ డ్రామా లో తడబడ్డప్పటికీ.., హార్రర్ జోనర్ పరీక్షలో మాత్రం మంచి మార్క్‌లు సంపాదించాడు. కానీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌పై బాగా ఆధారపడ్డాడు. ఒకట్రెండు కామెడీ సీన్స్ ఉంటే, ఆడియన్స్‌కు ఇంకా బాగుండేది. ఈ సినిమాకు చేతన్‌భరద్వాజ్ మ్యూజిక్ మంచి ఫ్లస్ అయ్యింది. డిఫరెంట్ ఆర్‌ఆర్‌తో ఆడియన్స్‌ను ఒకట్రెండు చోట్ల భయపెట్టాడు. సాహు గారపాటి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా రెండు గంటల ఐదు నిమిషాలకు ల్యాగ్‌లేకుండా బాగానే కట్ చేశాడు ఎడిటర్. కెమెరా పనితనం బాగుంది.
ఫైనల్‌గా రోటీన్ హారర్- థ్రిల్లర్ సినిమాలు చూసే సాధారణ ఆడియన్స్‌ను కిష్కింధపురి సినిమా తప్పక సర్‌ప్రైజ్ చేస్తుంది. థ్రిల్ చేస్తుంది. కానీ కంప్లీట్‌గా కాదు.