ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి జరిగింది. అర్థరాత్రి వేళ సైఫ్ ఇంట్లోకి దొంగ చొర బడ్డాడు. సైఫ్ అతన్నీ అడ్డుకోవడడంతో, ఈ దుండగుడు సైఫ్‌పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడని ముంబై మీడియా చెబుతోంది. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ లీలావతిలో సైఫ్‌కు చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. సైఫ్‌అలీఖాన్‌కు ట్రీట్‌మెంట్ జరుగుతోంది. సైఫ్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్స్ బృందంలో ఓ కాస్మోటిక్, న్యూరోసర్జన్ ఉన్నారని బాలీవుడ్ సమాచారం. ఈ కేసును పోలీసులు పరిశోధన చేస్తున్నారు.(Saif Ali Khan Stabbed).
Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్ సూక్ష్మదర్శని రివ్యూ
‘దిల్ చాహ్‌తా హై, కల్ హో న హో, హమ్‌తుమ్, ఓం కార, రేస్, లవ్ ఆజ్ కల్, తన్హాజీ, విక్రమ్‌వేదా’ వంటి ఎన్నో బాలీవుడ్ సూపర్‌హిట్ ఫిల్మ్స్‌లో సైఫ్ అలీఖాన్ యాక్ట్ చేశాడు. హిందీలోని పలుమల్టీస్టారర్ ఫిల్మ్స్ లో సైఫ్ (Saif Ali Khan) యాక్ట్ చేశాడు.

తెలుగులో ప్రభాస్ హీరోగా చేసిన ‘ఆదిపురుష్’, ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘దేవర’ చిత్రాల్లో సైఫ్‌అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. సైఫ్‌అలీఖాన్‌పై జరిగిన దాడికి షాకైయ్యానని, ఆయన త్వరలోనే కోలుకోవాలని ఎన్టీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
Deeply Disturbed by news of the attack by an intruder on #SaifAliKhan
Wishing and praying for his speedy recovery.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 16, 2025